కృష్టాజిల్లాలో చిక్కిన ఒకే రోజు ఏడు హత్యల రౌడీ షీటర్ డేవిడ్ రాజు

కరుడుగట్టిన రౌడీ షీటర్ డేవిడ్ రాజు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు కృష్ణా జిల్లాలో డేవిడ్ రాజుని అదుపులోకి తీసుకున్నారు. 1991 నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతడిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. డేవిడ్ రాజు గతంలో ఒకే రోజు ఏడు హత్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఎర్రగడ్డలో జరిగిన ఈ హత్యలు సంచలనం సృష్టించాయి. గత 16 సంవత్సరాలుగా ఈ రౌడీషీటర్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు […]

  • Venkata Narayana
  • Publish Date - 10:12 pm, Fri, 23 October 20

కరుడుగట్టిన రౌడీ షీటర్ డేవిడ్ రాజు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు కృష్ణా జిల్లాలో డేవిడ్ రాజుని అదుపులోకి తీసుకున్నారు. 1991 నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతడిపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. డేవిడ్ రాజు గతంలో ఒకే రోజు ఏడు హత్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో ఎర్రగడ్డలో జరిగిన ఈ హత్యలు సంచలనం సృష్టించాయి. గత 16 సంవత్సరాలుగా ఈ రౌడీషీటర్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ నరహంతకుడిపై 1991లో ఎస్సార్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా అనేక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో డేవిడ్ రాజు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు పక్కా ప్లాన్ తో అతడ్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.