ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్టులు కూలీలు.. ఇదీ దౌర్భాగ్యం..!

| Edited By:

Sep 28, 2019 | 9:59 AM

ఇండియా తరపున చాలామంది ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. కాని, ఒకప్పుడు ఇండియాకి బంగారు పతకాలు తీసుకొచ్చిన వారు.. ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. గత 120 సంవత్సరాల నుంచి ఒలంపిక్స్‌లో ఇండియా పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో అమెరికా 2,550, జర్మనీ 1681, చైనా 546 మెడల్స్ సాధించాయి. కాని ఇండియా మాత్రం ఇప్పటి వరకూ కేవలం 28 మెడల్స్ మాత్రమే సాధించింది. కాగా, అందులో 11 మెడల్స్ 1980కి ముందు ఒక్క […]

ఒలంపిక్స్ గోల్డ్ మెడలిస్టులు కూలీలు.. ఇదీ దౌర్భాగ్యం..!
Follow us on

ఇండియా తరపున చాలామంది ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. కాని, ఒకప్పుడు ఇండియాకి బంగారు పతకాలు తీసుకొచ్చిన వారు.. ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. గత 120 సంవత్సరాల నుంచి ఒలంపిక్స్‌లో ఇండియా పార్టిసిపేట్ చేస్తూనే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో అమెరికా 2,550, జర్మనీ 1681, చైనా 546 మెడల్స్ సాధించాయి. కాని ఇండియా మాత్రం ఇప్పటి వరకూ కేవలం 28 మెడల్స్ మాత్రమే సాధించింది. కాగా, అందులో 11 మెడల్స్ 1980కి ముందు ఒక్క హాకీలో మాత్రమే వచ్చాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా లేకుండా ఆకలి చావులతో బాధపడే కెన్యా ఇండియా కాన్నా ఎక్కువ మెడల్స్ ని సాధించింది. ప్రపంచంలోనే డెవలప్ అయ్యే కంట్రీలో చివరిలో ఉన్న జమైకా ఒలంపిక్స్ లో 78 మెడల్స్ ను సాధించింది. పాపులేషన్‌లో రెండో స్థానంలో ఉన్న ఇండియా, మంగళ్ యాన్ లాంటి స్పేస్ మిషన్స్‌‌తో దూసుకెల్లే మనదేశం కేవలం 28 మెడల్స్ ని మాత్రమే సాధించింది.

అమెరికాకు చెందిన స్విమ్మర్ మైకిల్ పిలిప్స్ ఒక్కడే ఇండియాతో సమానంగా ఒలంపిక్స్‌లో 28 మెడల్స్ సాధించాడు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌లో అమెరికా 121 మెడల్స్ సాధిస్తే.. చైనా 70, రష్యా 56 మెడల్స్‌ని సాధించాయి. ఉత్తర ప్రదేశ్ కన్నా చిన్నగా ఉండే సౌత్ కొరియా 21 మెడల్స్‌ని సాధించింది. కేవలం 5 కోట్ల జనాభా ఉండే కెన్యా 13 మెడల్స్ సాధించింది. ఇక ఇరాన్ 8, నార్త్ కొరియా 7, వెనెజులా 3 మెడల్స్‌ని సాధించాయి. కాని 136 కోట్ల జనాభా ఉన్న ఇండియా మాత్రం కేవలం 2 మెడల్స్ ని మాత్రమే సాధించింది. ఇండియాకి ఉన్న పాపులేషన్ ప్రకారం చూసుకుంటే 150 మెడల్స్‌ని సాధించవచ్చు. కాని 2 మాత్రమే సాధించింది అంటే ఒలంపిక్స్‌‌లో ఇండియా పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది. వేరే దేశాలకు చెందిన వారు ఒలంపిక్స్‌లో మెడల్స్ సాధిస్తే.. మరి ఇండియాకి ఏమైంది..? ఇండియా చెందిన అథ్లెట్స్ ఎందుకు మెడల్స్ సాధించలేకపోతున్నారు..?

ఫైనాన్షియల్ కండీషన్ సరిగా లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అమెరికా ఒక్కో అథ్లెట్ పై రోజుకు రూ.22 ఖర్చుపెడుతుంది. చైనా 6, బ్రిటన్ 5, యూకే 50 పైసలు, జమైకా 19 పైసలు ఖర్చు చేస్తున్నాయి. కాని ఇండియా మాత్రం ఒక్కో అథ్లెట్ పై రోజుకి 3 పైసలు ఖర్చు చేస్తోంది. దీనివల్ల ఆటగాళ్లకి సరైన ఫుడ్, సరైన కోచింగ్, సరైన ఎక్విప్ మెంట్స్ దొరక్క అనుకున్న స్థాయిని అందుకోలేకపోతున్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో స్పోర్ట్స్ పై ఖర్చు చేసేది చాలా తక్కువ. కాగా ఈ సంవత్సరం స్పోర్ట్ కోసం ప్రభుత్వం రూ. 2,216 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

అదే బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం స్పోర్ట్ కోసం రూ. 9000కోట్లని ఖర్చు చేస్తోంది. అయితే ఇండియా మాత్రం స్పోర్ట్ పై కాకుండా.. ప్రముఖుల విగ్రహాల పై ఎక్కువ ఖర్చు చేస్తోంది. అయితే దేశానికి సేవ చేసిన వారికి గుర్తుగా విగ్రహాలు పెట్టకూడదా అంటే పెట్టొచ్చు. కాని కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో అర్థం ఏముంది. ఇక, 2016లో చూసుకుంటే ఒలంపిక్స్ కోసం ఆటగాళ్లను తయారు చేయడానికి ఇండియా రూ.810 కోట్లను ఖర్చు చేసింది. అయినా వారికి కావల్సిన మినిమం రిక్వైర్ మెంట్స్ కల్పించడంలో విఫలమైంది. 2016లో ఒలంపిక్స్ కు ఎంపికైన లలితా బాబర్.. కనీసం షూస్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఆమెని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈమె పరిస్థితి చూసి ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ రూ. 30 వేల రూపాయలు ఖర్చు చేసి షూస్ కొనిచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. మరి వీరికోసం ఖర్చు చేయమని గౌర్నమెంట్ రిలీజ్ చేసిన రూ.810 కోట్లు ఏమైనట్టు.

ఇక సెలక్షన్స్ విషయానికొస్తే.. వేరే దేశాలు టాలెంట్ ఉన్న వారిని మాత్రమే సెలక్ట్ చేస్తాయి. కాని ఇండియాలో అలా కాదు. మరోవైపు కోచ్ లో వేధింపులు దీని గురించి చెప్పినా ఎవరు పట్టించుకోరు. అంజు బాబీ జార్జ్ గుర్తుండే ఉంటుంది. కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. క్రీడా మంత్రి వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్జునా అవార్డు గ్రహీత, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీల్లో భారత్‌కు పతకం సాధించిన అంజు బాబీ జార్జ్‌ని కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా గతేడాది ఉమెన్ చాందీ ప్రభుత్వం నియమించింది. క్రీడా మంత్రి ప్రవర్తనపై సీఎం విజయన్‌కు అంజు బాబీ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తన స్థానంలో మరొకరిని నియమించేందుకు రాజకీయాలు చేస్తున్నారని గ్రహించిన ఆమె, బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకే స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగింది.

ఇక ఒకప్పుడు ఇండియాకి గోల్స్ మెడల్స్ సాధించిన వారు ఇప్పుడు ఎలా జీవిస్తున్నారంటే.. పారా ఒలంపిక్స్ స్విమ్మింగ్ లో 50కి పైగా పతకాలు సాధించిన భరత్ కుమార్ ఇప్పుడు కార్లు కడుగుతూ జీవనం సాగిస్తున్నారు. బీహార్ కి చెందిన కబడ్డీ ఛాంపియన్ ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటోంది. వింటర్ ఒలంపిక్స్ లో స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన రాజ్ కుమార్ ఇప్పుడు రోడ్డు పక్కన వస్తువులు అమ్ముకుంటున్నాడు. ఇప్పటికైనా ఒలంపిక్స్ పై ఇండియా దృష్టి పెడితే బాగుంటుంది.