బౌల్ట్‌.. బంతిని తినేస్తావా ఏంటి?

శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల జరుగుతోన్న తొలి టెస్టులో ఓ విచిత్ర ఘటన ముందు అందర్నీ కంగారు పెట్టినా..తర్వాత వినోదాన్ని పంచింది.  లంక బౌలర్‌ వేసిన ఓ బాల్ బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ సరదా ఘటన గ్రౌండ్‌లో నవ్వులు పూయించింది. రెండో రోజు ఆటలో లసిత్‌ ఎంబుల్‌డేనియా బౌలింగ్‌ చేస్తుండగా ట్రెంట్‌బౌల్ట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. బ్యాట్స్‌మన్‌ అనుకోకుండా ఆడిన ఓ స్వీప్‌షాట్‌ బంతి.. అతడి హెల్మెట్‌లోని […]

బౌల్ట్‌.. బంతిని తినేస్తావా ఏంటి?
Caught And Boult
Follow us

|

Updated on: Aug 16, 2019 | 4:08 PM

శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్ల జరుగుతోన్న తొలి టెస్టులో ఓ విచిత్ర ఘటన ముందు అందర్నీ కంగారు పెట్టినా..తర్వాత వినోదాన్ని పంచింది.  లంక బౌలర్‌ వేసిన ఓ బాల్ బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌లో చిక్కుకుంది. అదృష్టవశాత్తూ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ సరదా ఘటన గ్రౌండ్‌లో నవ్వులు పూయించింది. రెండో రోజు ఆటలో లసిత్‌ ఎంబుల్‌డేనియా బౌలింగ్‌ చేస్తుండగా ట్రెంట్‌బౌల్ట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. బ్యాట్స్‌మన్‌ అనుకోకుండా ఆడిన ఓ స్వీప్‌షాట్‌ బంతి.. అతడి హెల్మెట్‌లోని గ్రిల్స్‌కు తగిలి అక్కడే ఇరుక్కుపోయింది. లక్కీగా అది గ్రిల్స్ మధ్యనే స్ట్రక్ అవ్వడంతో.. అతడికి  ఎలాంటి గాయం కాలేదు. అయితే బౌల్ట్‌ ఆడిన బంతి బ్యాట్‌ టాప్‌ ఎడ్జ్‌కు తీసుకున్నట్టు కనిపించినా తర్వాత ఎటుపోయిందో ఆటగాళ్లెవరికీ అర్థం కాలేదు. లంక ఫీల్డర్లు అయోమయంలో పడిపోయారు. తర్వాత గమనించి బంతిని తీయడంతో ఆటను కొనసాగించారు.

ఈ  సరదా సన్నివేశం జరిగిన కొద్దిసేపటికే సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఐసీసీ స్వయంగా ‘కాట్‌ అండ్‌ బౌల్ట్‌’ అంటూ సరదా ట్వీట్‌ చేయడంతో క్రికెట్‌ అభిమానులు సరదా ట్వీట్లు చేశారు. ‘బౌల్ట్‌ బంతిని తినేస్తావా ఏంటి?’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.