MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీని ఇలా మీరెప్పుడూ చూసుండరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

|

Jun 22, 2021 | 11:29 AM

MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్నాడు. ఫ్యామిలితీ కలిసి వెకేషన్‌లో ఉన్న ధోనీ..

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీని ఇలా మీరెప్పుడూ చూసుండరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
Dhoni
Follow us on

MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్నాడు. ఫ్యామిలితీ కలిసి వెకేషన్‌లో ఉన్న ధోనీ.. రోజుకో లుక్‌తో అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. తాజాగా ధోనీ న్యూ లుక్‌ కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ 14 వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో తనకు దొరికిన సమయాన్ని ధోనీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ధోనీ.. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ టూర్‌ వెళ్లాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లా వెకేషన్‌కు వెళ్లాడు.

సిమ్లా వెకేషన్‌లో ధోనీ తన కుటుంబ సభ్యులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు.. కొత్త హెయిర్ స్టైల్, మీసం కట్టుతో నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. హిమాచల్‌ప్రదేశ్ సంప్రదాయ టోపీ ధరించి ఉన్న ఫోటో, జీవాతో కొండపై నిల్చుని దిగిన ఫోటులు, ధోనీ న్యూ లుక్‌ కు సంబంధించిన ఇతర ఫోటోలను సాక్షి, జీవా తమ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసి మహీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ‘బాస్ ఈజ్ సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Ms Dhoni

కాగా, పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన నేపథ్యంలో ఐపీఎల్ సీజన్14 తాత్కాలికంగా వాయిదా పడిన పడిన విషయం తెలిసిందే. టోర్నీ వాయిదా పడే సమయానికి మొత్తం 29 మ్యాచ్‌లను నిర్వహించారు. ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. వీటిని సెప్టెంబర్ 19 నుంచి నిర్వహించనున్నట్లు బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా యూఏఈలో నిర్వహించనున్నట్లు తెలిపింది.

Dhoni Pics:

Also read:

గుడ్ న్యూస్.. దేశంలో తగ్గుతోన్న కరోనా తీవ్రత.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య..

viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .