Paris Olympics 2024: గురి చూసి కొట్టారు.. క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్‌

|

Jul 25, 2024 | 7:30 PM

పారిస్ ఒలింపిక్స్‌ను భారత్‌ పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది. మ‌హిళ‌ల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో.. భార‌త జ‌ట్టు నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఆర్చరీ బృందం క్వార్టర్ ఫైన‌ల్స్‌కు అర్హత సాధించింది. మొత్తం 1953 పాయింట్లతో ఇండియా మ‌హిళ ఆర్చరీ జ‌ట్టు నాలుగ‌వ స్థానంలో నిలిచింది.

Paris Olympics 2024: గురి చూసి కొట్టారు.. క్వార్ట్సర్స్‌కు చేరిన భారత మహిళా ఆర్చరీ టీమ్‌
Paris Olympics 2024
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌ను భారత్‌ పాజిటివ్‌గా స్టార్ట్ చేసింది. మ‌హిళ‌ల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో.. భార‌త జ‌ట్టు నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఆర్చరీ బృందం క్వార్టర్ ఫైన‌ల్స్‌కు అర్హత సాధించింది. మొత్తం 1953 పాయింట్లతో ఇండియా మ‌హిళ ఆర్చరీ జ‌ట్టు నాలుగ‌వ స్థానంలో నిలిచింది. బుధవారం (జులై 24) పారిస్‌ వేదికగా 33వ ఒలింపిక్స్‌ పోటీలు ప్రారంభయ్యాయి. సాకర్‌, రగ్బీ మ్యాచ్‌లతో విశ్వక్రీడలు గ్రాండ్‌గా స్టార్ట్‌ అయ్యాయి. మొత్తంగా 32 క్రీడాంశాల్లో 329 పతకాల కోసం పోరు జరగనుంది. భారత్‌ నుంచి ఈసారి 117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. గత ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు గెలిచిన భారత్‌… ఈసారి ఎన్ని పతకాలు గెలుస్తుందా…? అని ఆసక్తిగా ఒలింపిక్స్‌ను తిలకిస్తున్నారు భారతీయులు. పారిస్ ఒలింపిక్స్ 33వ ఎడిషన్ జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. అయితే కొన్ని పోటీలు ముందుగానే ప్రారంభమయ్యాయి.ఇందులో భాగంగా గురువారం భారత మహిళా, పురుషుల జట్లు ఆర్చరీలో పాల్గొంటున్నాయి. తొలి క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ రౌండ్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టు నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్‌తో పాటు దక్షిణ కొరియా, చైనా, మెక్సికోలు కూడా క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి.

 

ఇవి కూడా చదవండి

భారత్‌కు చెందిన దీపికా కుమారి, అంకితా భకత్, భజన్ కౌర్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లో మంచి ప్రదర్శన చేశారు. అంకితా భకత్ 666 వ్యక్తిగత స్కోర్‌తో 11వ ర్యాంక్‌ను సాధించగా, భజన్ కౌర్ 659 వ్యక్తిగత స్కోర్‌తో 22వ, 23వ ర్యాంకుల్లో, దీపికా కుమారి 658 వ్యక్తిగత స్కోర్‌తో 22వ, 23వ ర్యాంకుల్లో నిలిచారు. దీంతో భారత్ మొత్తం స్కోరు 1983 కాగా, భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్ రౌండ్‌లో జూలై 28న ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో తలపడవచ్చు.

భారతదేశం కాకుండా, దక్షిణ కొరియా, చైనా, మెక్సికో వరుసగా 2046, 1996, 1986 పాయింట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దీంతో పాటు ఈ మూడు జట్లు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఈ రౌండ్‌లో అత్యధిక స్కోరు 2046 పాయింట్లతో దక్షిణ కొరియా జట్టు క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ రౌండ్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్

  • దక్షిణ కొరియా vs అమెరికా/చైనీస్ తైపీ
  • చైనా vs ఇండోనేషియా/మలేషియా
  • మెక్సికో vs జర్మనీ/గ్రేట్ బ్రిటన్
  • భారత్ vs ఫ్రాన్స్/నెదర్లాండ్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..