Airthings Masters Chess: ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌..!

|

Feb 21, 2022 | 3:29 PM

R Praggnanandhaa Vs Magnus Carlsen: ఈ విజయం తర్వాత ప్రగ్నానంద 12వ ర్యాంక్‌కు చేరుకోగా, భారత గ్రాండ్‌మాస్టర్ 8 పాయింట్లతో ఉన్నాడు. అతను గతంలో లెవ్ అరోనియన్‌పై మాత్రమే విజయాన్ని నమోదు చేశాడు.

Airthings Masters Chess: ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌..!
R Praggnanandhaa Vs Magnus Carlsen
Follow us on

R Praggnanandhaa Vs Magnus Carlsen: ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌(Airthings Masters Chess Tournament)లో భారతదేశానికి చెందిన 16 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రగ్నానంద కీలక అడుగు వేశాడు. అతను ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. సోమవారం ఉదయం ఆడిన గేమ్‌లో ప్రగ్నానంద నల్ల పావులతో ఆడుతూ 39 ఎత్తుల్లో కార్ల్‌సెన్‌ను ఓడించాడు.

12వ స్థానానికి చేరుకున్న భారత స్టార్..

ఈ విజయం తర్వాత ప్రగ్నానంద 12వ ర్యాంక్‌కు చేరుకోగా, భారత గ్రాండ్‌మాస్టర్ 8 పాయింట్లతో ఉన్నాడు. అతను గతంలో లెవ్ అరోనియన్‌పై మాత్రమే విజయాన్ని నమోదు చేశాడు. ఇది కాకుండా, అతను రెండు గేమ్‌లను డ్రాగా చేసుకోగా, 4వ మ్యాచులో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రగ్నానంద అనీష్ గిరి, క్వాంగ్ లిమ్‌లతో జరిగిన మ్యాచ్‌లను డ్రా చేసుకున్నాడు. అయితే ఎరిక్ హాన్సెన్, డింగ్ లిరెన్, జాన్ క్రిజ్టోఫ్ డుడా, షఖ్రియార్ మమెద్యరోవ్ చేతిలో ఓడిపోయాడు.

ఇయాన్ నెపోమ్నియాచ్చి 19 పాయింట్లతో టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. కొన్ని నెలల క్రితం నార్వేకి చెందిన కార్ల్‌సెన్‌తో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఓడిపోయిన రష్యా ఆటగాడు ఇయాన్ నెపోమ్నియాచ్చి.. 19 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆటగాడు ప్రతి విజయానికి 3 పాయింట్లు, డ్రా కోసం 1 పాయింట్‌ను పొందుతాడు. తొలి దశలో ఇంకా 7 రౌండ్లలో తలపడాల్సి ఉంది.

12 ఏళ్ల వయసులో విశ్వనాథన్ ఆనంద్ రికార్డు బద్దలు..

2018లో ప్రగ్నానందకు 12 సంవత్సరాల వయసులో భారతదేశపు లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు. గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ను సాధించాడు. విశ్వనాథన్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు. దీనికి ముందు 2016లో ప్రజ్ఞానంద యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌గా టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.

Also Read: IPL 2022 Auction: ఆ ఆటగాడిపై భారీగా పందెం ఖాయడం రిస్కే.. కానీ, మాకు వేరే దారిలేదు: ఎస్‌ఆర్‌హెచ్ కోచ్

ICC T20I Rankings: తగ్గేదేలే అంటున్న హిట్‌మ్యాన్‌ సేన.. ఆరేళ్ల తర్వాత టీమ్‌ ఇండియా ఘనత..