Manu Bhaker Video: గురిపెట్టి గుండెల్లో కొట్టిందిగా..! చీరకట్టులో మెరిసిన ‘షూటింగ్’ సుందరి.. శారీ ధరెంతంటే?

|

Aug 31, 2024 | 10:36 AM

Manu Bhaker spotted on the set of KBC 16: పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మను పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వివిధ సన్మాన వేడుకలకు హాజరవడం కనిపించింది. అదే సమయంలో, ఇప్పుడు ఆమె KBC లోనూ తన మ్యాజిక్ చూపించనుంది. ఎక్కడ చూసినా మను అథ్లెటిక్, క్యాజువల్ వేర్‌లో కనిపిస్తుంటుంది. తొలిసారిగా ఎథ్నిక్ డ్రెస్‌లో కనిపించింది. మను ఈ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Manu Bhaker Video: గురిపెట్టి గుండెల్లో కొట్టిందిగా..! చీరకట్టులో మెరిసిన ‘షూటింగ్’ సుందరి.. శారీ ధరెంతంటే?
Manu Bhaker Saree Price
Follow us on

Manu Bhaker spotted on the set of KBC 16: పారిస్ ఒలింపిక్స్ 2024 మను భాకర్ 2 కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత సోషల్ మీడియాలో మను భాకర్ ఎంతో పాపులారిటీ సాధించింది. ఇదే క్రమంలో తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా చీరలో కనిపించిన మను భాకర్ అభిమానులను కనువిందు చేస్తోంది. కాంస్య పతకాన్ని గెలుచుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్‌తో కలిసి మాను భాకర్.. త్వరలో కౌన్ బనేగా కరోడ్‌పతి అంటే KBC 16 ప్రత్యేక ఎపిసోడ్‌లో కనిపించబోతున్నారు. ఈ క్రమంలో ఆషోకు హాజరైన మను భాకర్ శారీ ఫొటోస్ సోషల్ మీడియాలో అల్లకల్లోలం చేస్తున్నాయి. బాలీవుడ్‌కి చెందిన షాహెన్‌షా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తోన్న ఈ షో సెట్‌లోని కొన్ని ఫొటోలు వెలువడ్డాయి. ఇందులో మను భాకర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

కౌన్ బనేగా కరోడ్‌పతిలో మను భాకర్..

పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి తిరిగి వచ్చిన తర్వాత, మను పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వివిధ సన్మాన వేడుకలకు హాజరవడం కనిపించింది. అదే సమయంలో, ఇప్పుడు ఆమె KBC లోనూ తన మ్యాజిక్ చూపించనుంది. ఎక్కడ చూసినా మను అథ్లెటిక్, క్యాజువల్ వేర్‌లో కనిపిస్తుంటుంది. తొలిసారిగా ఎథ్నిక్ డ్రెస్‌లో కనిపించింది. మను ఈ లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ సందర్భంగా మను అందమైన పూల నెట్ ప్యాటర్న్ చీరను ధరించి కనిపించింది. అలాగే, స్లీవ్‌లెస్ గోల్డెన్ బ్లౌజ్ ధరించింది. మను చీరతో మెడలో ఏమీ వేసుకోకపోగా, ఆమె చెవుల్లో చాలా చిన్న చెవిపోగులు ధరించి, జుట్టులో గజ్రా కట్టి ఉంది.

చీర ధర రూ.58,500లు..

చీరలో సందడి చేసిన మను భాకర్.. అభిమానులకు కనువిందు చేస్తోంది. అయితే, ఈ ఫొటోలో మను భాకర్ ధరించిన చీరపైనా అందరి చూపు పడింది. ఆమె ధరించిన చీర ధర ఎంత అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చీర ధర రూ.58,500లు అంటున్నారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ 2 కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా మను నిలిచింది. 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మొదటి కాంస్య పతకాన్ని గెలుచుకోగా, మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్‌తో కలిసి మను రెండవ కాంస్యాన్ని గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..