వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను కేంద్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రపంచఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నిఖత్ జరీన్‌తో పాటు కాంస్యాలతో మెరిసిన ప్రవీణ్ హుడా, మనీషా మౌన్‌ను బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సన్మానించాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ఠాకూర్ కార్యక్రమానికి హాజరై క్రీడాకారులను అభినందించారు. ప్లేయర్స్ కు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. స్పోర్ట్స్‌లో ఇండియాను ఫస్ట్ ప్లేస్ లో నిలపాలని ప్లేయర్స్‌ను కోరారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. వచ్చే ఒలింపిక్స్ లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధిస్తుందని అనురాగ్ రాకూర్ అభిప్రాయపడ్డారు.
తనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లభిస్తోందని చెప్పారు వరల్డ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో రూ.50 లక్షల ఆర్థిక సాయం చేసిందన్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని నిఖత్ తెలిపారు.
అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఇస్తాంబుల్‌లో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 52 కేజీల విభాగంలో తెలంగాణ నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం, ప్రవీణ్ హుడా,మనీషా మౌన్ కాంస్య పతకాలు సాధించారు.