Roger Federer: ఇప్పటికే టెన్నిస్ క్రీడాభిమానులకు సెరెనా విలియమ్స్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే.. ఇప్పుడు రోజర్ ఫెదరర్ షాక్ ఇచ్చారు. పురుషుల టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరైన స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పారు. తాను వృత్తిపరమైన కెరీర్‌కు ముగింపు పలికినట్లు ప్రకటించాడు. వచ్చే వారం జరిగే లావర్ కప్ తన కెరీర్‌లో చివరి ATP టోర్నమెంట్ అని.. ఆ తర్వాత తాను ఎలాంటి గ్రాండ్‌స్లామ్ లేదా టూర్ ఈవెంట్‌లలో పాల్గొననని ఫెదరర్ గురువారం ప్రకటించాడు. దీంతో సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటన నుంచి పూర్తిగా కోలుకోని టెన్నిస్ అభిమానులకు ఇప్పుడు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
టెన్నిస్ ఓపెన్ ఎరాలో గొప్ప ఆటగాడిగా పరిగణించబడుతున్న స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్. తన రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రీడా జీవితంలో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టెన్నిస్ క్రీడాకారుడిగా రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..