Indian Hockey team for South Africa Tour: జనవరి 22 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న 4 దేశాల టోర్నీకి 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. జూనియర్ స్థాయిలో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశం కల్పించారు. పారిస్ ఒలింపిక్స్ సన్నాహకానికి కీలకంగా భావించే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత భారత జట్టు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టు కెప్టెన్సీని హర్మన్‌ప్రీత్ సింగ్‌కు అప్పగించారు. ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న హార్దిక్ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూనియర్ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువకుడు అరిజిత్ సింగ్ హుండాల్, బాబీ సింగ్ ధామీ తొలిసారి సీనియర్ స్థాయిలో ఆడనున్నారు. కృష్ణ పాఠక్, పీఆర్ శ్రీజేష్ లతో పాటు గోల్ కీపింగ్ లో పవన్ కు అవకాశం కల్పించారు. గత టోర్నీ నుంచి బ్రేక్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కూడా తిరిగి వచ్చాడు.
The men's national team begins 2024 with a tour of South Africa starting 22nd January.
Harmanpreet Singh to lead the squad against France, Netherlands and South Africa.Drop a comment to send in your wishes for the team.#HockeyIndia #EnRouteToParis #IndiaKaGame #SATour… pic.twitter.com/RN0vRb74Se
— Hockey India (@TheHockeyIndia) January 10, 2024
ఈ పర్యటన గురించి భారత జట్టు ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ మాట్లాడుతూ, ‘దక్షిణాఫ్రికా టూర్‌తో ఒలింపిక్ సీజన్‌ను ప్రారంభించడం పట్ల మేం చాలా సంతోషిస్తున్నాం. అక్కడ అత్యుత్తమ జట్లతో ఆడే అవకాశం లభిస్తుంది. మేం ఒక పెద్ద జట్టును ఎంచుకున్నాం. తద్వారా ఆటగాళ్లందరికీ అవకాశం లభిస్తుంది. FIH ప్రో లీగ్‌కు ముందు, మ్యాచ్ పరిస్థితులలో అందరూ ఆడటం నేను చూడగలను. ఇద్దరు జూనియర్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. భారత జట్టు జనవరి 22, 24 తేదీల్లో ఫ్రాన్స్‌తో (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి), దక్షిణాఫ్రికాతో జనవరి 26న (రాత్రి 9.30 గంటల నుంచి), నెదర్లాండ్స్‌తో జనవరి 28న (మధ్యాహ్నం 2 గంటల నుంచి) ఆడనుంది.
గోల్‌కీపర్లు: పీఆర్ శ్రీజేష్, కృష్ణ పాఠక్, పవన్
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వరుణ్ కుమార్, సుమిత్, సంజయ్, రబీచంద్ర సింగ్ మొయిరంగ్థమ్
మిడ్‌ఫీల్డర్: వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రాజ్‌కుమార్ పాల్, షంషేర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్
ఫార్వర్డ్: మన్‌దీప్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, ఆకాష్‌దీప్ సింగ్, అరిజిత్ సింగ్ హుందాల్, బాబీ సింగ్ ధామి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..