Paris Olympics 2024: ‘వెల్‌డన్ బాయ్స్ మీ విజయం ఎంతో ప్రత్యేకం’.. భారత హాకీ జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు

|

Aug 08, 2024 | 9:19 PM

ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది. ఈ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొడుతోన్న భారత హాకీ జట్టు కాంస్యం గెల్చుకుంది. గురువారం (ఆగస్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్ పై 2-1 తేడాతో భారత జట్టు విజయం సాధించింది.

Paris Olympics 2024: వెల్‌డన్ బాయ్స్ మీ విజయం ఎంతో ప్రత్యేకం.. భారత హాకీ జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు
Indian Hockey Team, PM Narendra Modi
Follow us on

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ లో గత కొన్ని రోజులుగా భారత ఆటగాళ్లకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడు మెడల్స్ దగ్గరే ఆగిపోయింది. చాలా మంది భారత ప్లేయర్లు త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. దీంతో భారత క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది. ఈ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొడుతోన్న భారత హాకీ జట్టు కాంస్యం గెల్చుకుంది. గురువారం (ఆగస్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్ పై 2-1 తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ లో నాలుగో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాకీ టీమ్ ను అభినందిస్తున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా మెన్స్ హాకీ టీమ్ ను అభినందించారు.

మీ విజయం ఎంతో మధురం..

‘ రాబోయ తరాలకు మీ విజయం ఎంతో స్ఫూర్తి నిస్తుంది. భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసింది. ఈ విజయం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో వారికి వరుసగా రెండో పతకం. భారత ఆటగాళ్ల నైపుణ్యం, పట్టుదల, టీమ్ స్పిరిట్ కు ఈ విజయం నిదర్శనం. ఈ విజయంలో భాగమైన ఆటగాళ్లందరికీ అభినందనలు. మన దేశానికి, హాకీ గేమ్ కు ఒక ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉంది. యువ క్రీడాకారులకు మీ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.

ఇవి కూడా చదవండి

భారత ఆటగాళ్లతో మాట్లాడిన ప్రధాని మోడీ.. వీడియో ఇదిగో..

 

ప్రధాని మోడీతో పాటు భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, అమిత్ షా, నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు అభినందనలు తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత హాకీ జట్టుకు అభినందనలు తెలియజేసిన వారిలో ఉన్నారు.

రాష్ట్రపతి విషెస్..

 అమిత్ షా రియాక్షన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..