“సుశాంత్​లా నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా”

త‌న ప‌ర్స‌న‌ల్ లైఫులో స‌మ‌స్యలు ఎదురైనప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. ఆ సమయంలో తన ఫ్యామిలీ మెంబ‌ర్స్ కంటికి రెప్పలా చూసుకున్నారని భారత క్రికెట్ టీమ్ స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమి వెల్లడించాడు.

సుశాంత్​లా నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా
Follow us

|

Updated on: Jun 20, 2020 | 1:16 PM

త‌న ప‌ర్స‌న‌ల్ లైఫులో స‌మ‌స్యలు ఎదురైనప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. ఆ సమయంలో తన ఫ్యామిలీ మెంబ‌ర్స్ కంటికి రెప్పలా చూసుకున్నారని భారత క్రికెట్ టీమ్ స్టార్ పేసర్‌ మహ్మద్‌ షమి వెల్లడించాడు. బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌పై స్పందిచిన షమి.. తాను కూడా జీవితంలో కుంగుబాటుకు గురయ్యానని తెలిపాడు. ఒత్తిడి అనేది ఒక స‌మ‌స్య అని..దాన్ని దాటి ముందుకు వెళ్లాల‌ని సూచించాడు. అద్బుత‌మైన నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమ‌న్న షమి.. అతను త‌న‌కు మంచి స్నేహితుడ‌ని చెప్పుకొచ్చాడు. త‌ను అలాంటి ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు కుటుంబ సభ్యులు సహాయం చేశారని పేర్కొన్నాడు.

ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. తాను ఒంటరివాడిని కాదని ఫ్యామిలీ మెంబ‌ర్స్ మేమున్నామంటూ భరోసా ఇచ్చార‌ని తెలిపాడు. ఆ సమయంలో తాను ఒంట‌రిగా ఉండ‌కుండా నిత్యం ఎవరో ఒకరు మాట్లాడేవాళ్లని… దైవభక్తి కూడా ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఉపయోగపడింద‌ని చెప్పాడు. సన్నిహితులతో మాట్లాడటం లేదా కౌన్సెలింగ్ తీసుకోవడం వ‌ల్ల ఒత్తిడిలో నుంచి బ‌య‌ట‌పడొచ్చ‌ని చెప్పాడు.