హైదరాబాద్ మారేడుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం జరిగింది. గ్రౌండ్‌లోనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్.. అక్కడే తుది శ్వాస విడిచాడు. బాలాజీనగర్‌కు చెందిన వీరేందర్‌నాయక్‌కు క్రికెట్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి అతడికి క్రికెటే లైఫ్ అయిపోయింది. అందుకే అతడు చదువుకుంటున్నా, జాబ్ చేస్తున్నా, పెళ్లై.. పిల్లలున్నా కూాడా క్రికెట్‌ను వదిలెేయలేదు. చివరికి అతడు చివరిశ్వాసలో కూడా క్రికెట్‌ను వదిలిపెట్టలేదు.
రెండు నెలల క్రితం మైనర్ హార్ట్ స్ట్రోక్ రావడంతో అతడు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌కి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సూచించారు. అయినప్పటికి అతడు బ్యాట్ పట్టకుండా, గ్రౌండ్‌లోకి దిగకుండా ఉండలేకపోయాడు. ఆదివారం ఈస్ట్ మారేడుపల్లి జీహెచ్‌ఎంసీ మైదానంలో ఎంపీ స్పోర్టింగ్, ఎంపీ బ్ల్యూస్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఎంపీ బ్ల్యూస్ టీం తరుపున బ్యాట్ పట్టాడు. చాలాసేపు బ్యాటింగ్ చేసిన వీరేందర్ నాయక్ 55 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కానీ అప్పటికే అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై.. అమాంతం కుప్పకూలిపోయాడు. వెంటనే అలర్టయిన స్టాఫ్, తోటి ప్లేయర్స్.. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు నిర్దారించారు.