వరల్డ్ కప్ లో చాహల్‌ చెత్త రికార్డు!

ఐసీసీ వరల్ద్ కప్ 2019లో భాగంగా టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ కెరీర్లో చెత్త రికార్డు నమోదైంది. తన వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చాహల్‌ పది ఓవర్లు బౌలింగ్‌ వేసి 88 పరుగులిచ్చాడు. వన్డేల్లో ఇది చాహల్‌ చెత్త ప్రదర్శనగా నమోదైంది. గతంలో వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడూ చాహల్‌ ఇంత భారీగా పరుగులు ఇవ్వలేదు. కాగా, ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో చెత్త ప్రదర్శనగా నమోదైంది. […]

వరల్డ్ కప్ లో చాహల్‌ చెత్త రికార్డు!
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2019 | 10:22 PM

ఐసీసీ వరల్ద్ కప్ 2019లో భాగంగా టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్ కెరీర్లో చెత్త రికార్డు నమోదైంది. తన వన్డే కెరీర్‌లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చాహల్‌ పది ఓవర్లు బౌలింగ్‌ వేసి 88 పరుగులిచ్చాడు. వన్డేల్లో ఇది చాహల్‌ చెత్త ప్రదర్శనగా నమోదైంది. గతంలో వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడూ చాహల్‌ ఇంత భారీగా పరుగులు ఇవ్వలేదు. కాగా, ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో చెత్త ప్రదర్శనగా నమోదైంది. అంతకుముందు ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌(110 పరుగులు-ఇంగ్లండ్‌పై), శ్రీలంక పేసర్‌ నువాన్‌ ప్రదీప్‌(88-ఆస్ట్రేలియా)లు అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లుగా నమోదయ్యారు.