IND Vs ENG: ఫలించిన భారత్ స్పిన్ మంత్రం.. పతనమైన ఇంగ్లాండ్ ఆట తంత్రం.. జైస్వాల్ సరికొత్త రికార్డు..

టీమ్ ఇండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‎మెన్ యశస్వి జైస్వాల్ సంచలనం సృష్టించారు. తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించారు. ధర్మశాలలో జరిగే ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరిగే ఐదవ టెస్ట్ సీరీస్ లో తొలిరోజు మంచి ఆటతీరును కనబరిచారు. దీంతో గొప్ప ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గురువారం హెచ్‌పిసిఎ గ్రౌండ్‌లో జైస్వాల్ చేసిన అర్ధ సెంచరీ 700 పరుగుల మార్క్ దాటింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు హాఫ్ సెంచురీ చేసి 712 పరుగులకు చేరారు.

IND Vs ENG: ఫలించిన భారత్ స్పిన్ మంత్రం.. పతనమైన ఇంగ్లాండ్ ఆట తంత్రం.. జైస్వాల్ సరికొత్త రికార్డు..
Ind Vs Eng Test Match
Follow us

|

Updated on: Mar 07, 2024 | 6:42 PM

టీమ్ ఇండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‎మెన్ యశస్వి జైస్వాల్ సంచలనం సృష్టించారు. తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించారు. ధర్మశాలలో జరిగే ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరిగే ఐదవ టెస్ట్ సీరీస్ లో తొలిరోజు మంచి ఆటతీరును కనబరిచారు. దీంతో గొప్ప ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గురువారం హెచ్‌పిసిఎ గ్రౌండ్‌లో జైస్వాల్ చేసిన అర్ధ సెంచరీ 700 పరుగుల మార్క్ దాటింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు హాఫ్ సెంచురీ చేసి 712 పరుగులకు చేరారు.

భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని స్టేడియంలో ఇలాంటి చరిత్రను కలిగి ఉన్నారు. 35 ఏళ్ల వయసులో 2016 సంవత్సరంలో ఇంగ్లాండుతో జరిగిన హోమ్ సిరీస్‌లో 655 పరుగులు చేశారు. లెజెండరీ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కూడా 2002లో ఇంగ్లాండు జట్టుపై విదేశీ గడ్డమీద 602 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచారు. ఇండియాలో ఇంగ్లండ్‌తో జరిగిన 1961-62 సిరీస్‌లో విజయ్ మంజ్రేకర్ చేసిన 586 పరుగుల మొత్తం ఒక ఇండియన్ క్రికెటర్ 1979లో చేసి రికార్డు సృష్టించారు. అప్పట్లో సునీల్ గవాస్కర్ 542 పరుగులు చేసి ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఇండియన్ టూర్‌లోని చివరి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, భారత స్పిన్ బౌలర్ల ధాటికి తొలి రోజు మొత్తం పది వికెట్లను కోల్పోయింది. టీం మొత్తం 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 58 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అలాగే బెన్ డకెట్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జానీ బెయిర్‌స్టోతో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్‌లతో సహా ఐదు విలువైన వికెట్లను కుల్దీప్ యాదవ్ తీసి ఇంగ్లాండ్ టీంను పెవీలియన్ బాట పట్టించారు. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 26 పరుగుల వద్ద వెటరన్ బ్యాటర్ జో రూట్‌ను క్రీజు నుంచి తొలగించడంతో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే తన 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, బెన్ ఫోక్స్, జేమ్స్ ఆండర్సన్‌లను ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరును చేయలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..