IND Vs ENG: ఎంతైనా ఈ ఇంగ్లీష్ ప్లేయర్ తోపు అబ్బా.! దెబ్బకు 23 ఏళ్ళ రికార్డు సమం చేశాడు..

ధర్మశాల టెస్టులో మరోసారి జాక్ క్రాలీ దంచికొట్టాడు. ఈ సిరీస్ అంతటా ఇంగ్లాండ్ ఆటగాళ్లు విఫలమవుతూ వస్తున్నా.. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రం వరుస అర్ధ సెంచరీలతో అదరగొడుతున్నాడు. చివరి టెస్టులోనూ మరో హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు.

IND Vs ENG: ఎంతైనా ఈ ఇంగ్లీష్ ప్లేయర్ తోపు అబ్బా.! దెబ్బకు 23 ఏళ్ళ రికార్డు సమం చేశాడు..
Ind Vs Eng
Follow us

|

Updated on: Mar 07, 2024 | 1:52 PM

ధర్మశాల టెస్టులో మరోసారి జాక్ క్రాలీ దంచికొట్టాడు. ఈ సిరీస్ అంతటా ఇంగ్లాండ్ ఆటగాళ్లు విఫలమవుతూ వస్తున్నా.. ఆ జట్టు డాషింగ్ ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రం వరుస అర్ధ సెంచరీలతో అదరగొడుతున్నాడు. చివరి టెస్టులోనూ మరో హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ మొదటి బంతి నుంచి వి‌జ‌ృంభించాడు. 64 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో అర్ధ సెంచరీ బాదేసిన క్రాలీ.. మొత్తంగా 108 బంతులు ఎదుర్కుని 79 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ఇతడి ధనాధన్ ఇన్నింగ్స్ కుల్దీప్ అద్భుతమైన బంతితో ఎండ్ చేశాడు.

దీంతో భారత్‌తో స్వదేశంలో ఒక టెస్టు సిరీస్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు క్రాలీ. ఈ ఫీట్‌తో అతడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ మాధ్యూ హెడెన్ రికార్డును సమం చేశాడు. 2001లో హెడెన్ టీమిండియాపై నాలుగు అర్ధ సెంచరీలు కొట్టాడు. భారత్‌లో ఏ జట్టు పర్యటించినా.. ఏ ఒక్క ఆటగాడు ఇప్పటివరకు ఈ ఫీట్ అందుకోలేకపోయాడు. 2001 తర్వాత ఇప్పుడు సరిగ్గా 23 ఏళ్ళ తర్వాత భారత జట్టుపై నాలుగు హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా క్రాలీ రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, ఐదో టెస్టులో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(5 వికెట్లు) దెబ్బకు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 175 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లీష్ ప్లేయర్లు ఫోక్స్, హర్ట్లీ క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

భారత్ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ వ్యూహాలు.. విదేశాంగ విధానంలో..
భారత్ పునర్నిర్మాణంలో ప్రధాని మోదీ వ్యూహాలు.. విదేశాంగ విధానంలో..
బాలాపూర్‌లో మొదలైన పూజా కార్యక్రమం.. లడ్డూ వేలానికి సర్వం సిద్ధం
బాలాపూర్‌లో మొదలైన పూజా కార్యక్రమం.. లడ్డూ వేలానికి సర్వం సిద్ధం
సినీ నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్
సినీ నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్
కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ..
కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ..
Horoscope Today: వారికి అనుకోకుండా ఆదాయ వృద్ధి..
Horoscope Today: వారికి అనుకోకుండా ఆదాయ వృద్ధి..
పద్దతిగా కనిపిస్తూనే పరువాలతో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్
పద్దతిగా కనిపిస్తూనే పరువాలతో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్
కొన్ని రోజుల్లో హర వీరమల్లు రీ స్టార్ట్‌..
కొన్ని రోజుల్లో హర వీరమల్లు రీ స్టార్ట్‌..
TVS నుంచి సరికొత్త బైక్‌.. గంటకు 215.9 కి.మీ వేగం.. ధర, ఫీచర్స్
TVS నుంచి సరికొత్త బైక్‌.. గంటకు 215.9 కి.మీ వేగం.. ధర, ఫీచర్స్
పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది
పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది
చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!
చూస్తుండగానే నడిరోడ్డుపై భారీ గొయ్యి !! కాస్తయితే మింగేసేదే !!