Women Asia Cup: రికార్డుల మోత మోగించిన భారత ఓపెనర్లు.. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన వాళ్లు వీరే

Women Asia Cup: ఉమెన్స్ ఆసియా కప్ లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో షఫాలీ వర్మ 236 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, స్మృతి మంధాన 213 పరుగులతో రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్లోనూ వీరిద్దరూ రాణించి భారత్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించారు.

Women Asia Cup: రికార్డుల మోత మోగించిన భారత ఓపెనర్లు.. ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన వాళ్లు వీరే
Asia Cup 2026 (2)

Updated on: Sep 14, 2026 | 10:35 AM

Women Asia Cup: దుబాయ్ వేదికగా ముగిసిన మహిళా ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ పోరులో శ్రీలంక జట్టును చిత్తు చేసిన మన క్రీడాకారిణులు అఖండ విజయాన్ని అందుకున్నారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్లు అగ్రస్థానంలో నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యంగ్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆసియా కప్ టోర్నమెంట్‌ ఆసాంతం అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించింది. ఆడిన ఐదు మ్యాచ్‌లలో అద్భుతమైన సగటుతో మొత్తం 236 పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె బ్యాట్ నుంచి మూడు అర్ధశతాకాలు రావడం విశేషం.

ఫైనల్ మ్యాచ్‌లో సైతం కేవలం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ జాబితాలో ఆమె సహచర ఆటగారైన స్టార్ ఓపెనర్ స్మృతి మధాన కేవలం 23 పరుగులు వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. మొత్తం ఐదు మ్యాచ్‌లలో కలిపి 213 పరుగులు చేసిన ఆమె ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేసింది. తుది పోరులో59 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తనవంతు బాధ్యత నిర్వర్తించింది.

ఈ పరుగుల జాబితాలో భారత క్రీడాకారిణుల తర్వాత స్థానాలలో శ్రీలంక దేశానికి చెందిన ముగ్గురు ఆటగాళ్లు నిలిచారు. నీలక్షి డి సిల్వా నాలుగు ఇన్నింగ్స్‌లలో 108 పరుగులు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆ జట్టు కెప్టెన్ చమరి అటపట్టు 5 ఇన్నింగ్స్‌లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె శ్రీలంక తరఫున అత్యధికంగా 36 పరుగులు సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది. మరో ఆటగాడు హర్షిత సమరవిక్రమ 98 పరుగులు చేసి ఐదో స్థానంలో నిలిచింది. భారత ఓపెనర్ల దూకుడు ముందు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.

భారత జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంతో పాటు ఓపెనర్ల ప్రదర్శనపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ప్రశంసల వర్షం కురిపించారు. కష్టకాలంలో జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించడంలో ఓపెనర్లు సఫలమయ్యారని తెలిపారు. షఫాలీ వర్మ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించడం జట్టుకు పెద్ద బలంగా మారిందని ఆమె కొనియాడారు. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ సైతం బ్యాటర్ల దూకుడును, స్పిన్నర్ల చక్కటి ప్రతిభను ప్రశంసించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us