IND vs ZIM 2nd T20I: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన తిలక్, ఇషాన్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్..

Zimbabwe vs India, 2nd T20I: తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌ల హాఫ్ సెంచరీలతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

IND vs ZIM 2nd T20I: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన తిలక్, ఇషాన్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్..
Ind Vs Zim 2nd T20i Ishan Kishan Tilak Varma Score

Updated on: Jul 25, 2026 | 6:19 PM

రెండో టీ20లో భారత్ జింబాబ్వేకు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారేలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. అభిషేక్ శర్మ 8 పరుగులకే అవుటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25) కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

శ్రేయస్ అవుటైన తర్వాత, ఇషాన్, తిలక్ వర్మ నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. జింబాబ్వే తరఫున, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవా, బ్రయాన్ బెన్నెట్, బ్లెస్సింగ్ ముజరబాని తలా ఒక వికెట్ తీసుకున్నారు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు హరారేలో జరుగుతోంది. టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, రిచర్డ్ న్గర్వా, బ్లెస్సింగ్ ముజారబానీ.

Follow Us