Vaibhav Suryavanshi : క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘనత..అండర్-19 వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో యువ కెరటం

Vaibhav Suryavanshi : అండర్-19 క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది.. అతనే టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్ పవర్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఈ కుర్రాడు, త్వరలో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

Vaibhav Suryavanshi : క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘనత..అండర్-19 వరల్డ్ కప్‌లో ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో యువ కెరటం
Vaibhav Suryavanshi

Updated on: Jan 15, 2026 | 7:52 AM

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చాడంటే చాలు మైదానంలో సిక్సర్ల వర్షం కురవాల్సిందే. అతడి ఆటతీరు ఎంత అగ్రెసివ్‌గా ఉంటుందంటే, ఆడే ప్రతి సిరీస్‌లోనూ కనీసం 15 నుంచి 20 సిక్సర్లు అలవోకగా బాదేస్తుంటాడు. అయితే ఈసారి అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో అతను కొట్టబోయే 20వ సిక్స్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ ఒక్క సిక్సర్‌తో వైభవ్ తన అండర్-19 వన్డే కెరీర్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అండర్-19 స్థాయిలో ఈ ఫీట్ సాధించిన మొదటి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించబోతున్నాడు.

సాధారణంగా ఏ బ్యాటర్ అయినా వంద కొట్టడం అంటే పరుగులు అనుకుంటాం. కానీ ఈ చిన్నారి సంచలనం మాత్రం సిక్సర్లతో సెంచరీ కొట్టబోతున్నాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అండర్-19 స్థాయిలో ఎంతో మంది దిగ్గజాలు ఆడారు కానీ, ఎవరూ కూడా వన్డే ఫార్మాట్‌లో వంద సిక్సర్లు కొట్టిన దాఖలాలు లేవు. మార్చి నెలలో 15వ ఏట అడుగుపెట్టబోతున్న వైభవ్, తన కెరీర్ మొదలుపెట్టిన కేవలం రెండేళ్లలోనే ఈ అద్భుతమైన ఘనతను సాధించబోతుండటం విశేషం. మిగిలిన బ్యాటర్లకు ఇది ఒక కలగానే మిగిలిపోవచ్చు కానీ వైభవ్‌కు మాత్రం ఇది ఒక సామాన్యమైన విషయంగా కనిపిస్తోంది.

2024లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వైభవ్, వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే కేవలం 18 అండర్-19 వన్డేల్లోనే 80 సిక్సర్లు బాదేశాడు. ఇప్పటికే ఈ జాబితాలో వైభవ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. వైభవ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ బ్యాటర్ జావద్ అబ్రార్ 31 మ్యాచ్‌ల్లో 51 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. దీనిని బట్టి చూస్తే వైభవ్ మిగిలిన వారికంటే ఎంత వేగంగా దూసుకుపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ వరల్డ్ కప్‌లో మరో 20 సిక్సర్లు బాదితే, అండర్-19 వన్డేల్లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకున్న ప్రపంచపు ఏకైక బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టిస్తాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..