A సైన్‌తోపాటు బుడ్డోడి డబుల్ థంబ్స్-అప్ సెలబ్రేషన్ వెనుక అసలు కథ ఇదే.. ఆ వినూత్న వేడుక ఎవరి కోసమంటే?

Vaibhav Sooryavanshi Celebrations: తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీతోనే సచిన్, రోహిత్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ, తన సంస్కారం, వినయంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. మైదానంలో బ్యాట్‌తోనే కాదు, మైదానం బయట కూడా ఈ 15 ఏళ్ల కుర్రాడు భారత క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.

A సైన్‌తోపాటు బుడ్డోడి డబుల్ థంబ్స్-అప్ సెలబ్రేషన్ వెనుక అసలు కథ ఇదే.. ఆ వినూత్న వేడుక ఎవరి కోసమంటే?
Vaibhav Sooryavanshi Celebrations

Updated on: Jul 24, 2026 | 9:33 PM

Vaibhav Sooryavanshi Celebrations: జింబాబ్వేపై వీరవిహారం చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, తన వినూత్న సంబరాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అర్ధశతకం సాధించిన వెంటనే హెల్మెట్ తీసి వేళ్లతో ‘A’ గుర్తును చూపుతూ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, అసలు ఆ సంకేతం వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను వైభవ్ స్వయంగా వెల్లడించాడు.

‘A’ గుర్తు వెనుక దాగివున్న మాతృప్రేమ..!

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది చరిత్ర సృష్టించిన వైభవ్, మ్యాచ్ అనంతరం బిసిసిఐ (BCCI)తో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆ వినూత్న వేడుక రహస్యాన్ని వివరిస్తూ.. ఆ ‘A’ గుర్తును తన తల్లి ఆర్తికి అంకితమిచ్చినట్లు తెలిపాడు. “నా ప్రతి విజయం వెనుక అమ్మ కష్టం ఉంది, అందుకే నా కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఈ తొలి అంతర్జాతీయ ఫిఫ్టీని అమ్మ పేరిట ముగిస్తున్నాను” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

ఇవి కూడా చదవండి

రింకూ సింగ్ ఇచ్చిన స్పెషల్ ఐడియా..!

కేవలం ‘A’ గుర్తు చూపించడమే కాకుండా, వైభవ్ రెండు చేతుల బొటనవేళ్లను పైకి చూపుతూ (డబుల్ థంబ్స్-అప్) మరో ప్రత్యేక రీతిలో వేడుకలు చేసుకున్నాడు. దీని వెనుక సీనియర్ సహచర ఆటగాడు రింకూ సింగ్ హస్తం ఉందని వైభవ్ చెప్పుకొచ్చాడు. “మ్యాచ్‌కు ముందే నేను, రింకూ భయ్యా దీని గురించి మాట్లాడుకున్నాం. హాఫ్ సెంచరీ కొడితే ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఆయనే నాకు సలహా ఇచ్చారు” అని నవ్వుతూ వివరించాడు.

ఆ సంతోషం నా కుటుంబం, కోచ్‌లకు అంకితం..!

ఈ చారిత్రాత్మక మైలురాయిపై వైభవ్ స్పందిస్తూ.. “నా జీవితంలో మంచి, చెడు సమయాల్లో నన్ను నమ్మి, నిరంతరం ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు, నన్ను తీర్చిదిద్దిన కోచ్‌లకు ఈ ఇన్నింగ్స్‌ను అంకితం ఇస్తున్నాను” అని తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన వైఫల్యాల తర్వాత తిరిగి ఇలా ఘనంగా పుంజుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

హరారే గ్రౌండ్‌తో ప్రత్యేక అనుబంధం..!

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంతో తనకున్న ప్రత్యేక సంబంధాన్ని కూడా ఈ యంగ్ సెన్సేషన్ పంచుకున్నాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ఇదే మైదానంలో 80 బంతుల్లో 175 పరుగులతో విధ్వంసం సృష్టించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ గ్రౌండ్ తనకు ఎంతగానో లక్కీ అని, ఇక్కడ బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని వైభవ్ ముగించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us