
India vs Srilanka: మొహాలీ వేదికగా టీమిండియా-శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కెరీర్లో ఇది 100వ టెస్టు మ్యాచ్. అంతకుముందు కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కోహ్లీకి టీమిండియా స్పెషల్ క్యాప్ అందించాడు. ఈ సమయంలో కోహ్లి భార్య అనుష్క శర్మ(Anushka Sharma) కూడా పక్కనే ఉన్నారు. క్యాప్ తీసుకున్న తర్వాత కోహ్లీ అనుష్కను కౌగిలించుకుని, ముద్దుపెట్టుకున్నాడు.
మొహాలీలో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ 100వ టెస్ట్ ఆడుతున్న విరాట్‌కు క్యాప్ అందించాడు. క్యాప్ అందుకున్న తర్వాత కోచ్‌తో పాటు ఆటగాళ్లందరికీ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత అనుష్కను కౌగిలించుకుని ముద్దులు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ వీడియోపై అభిమానులు చాలా రకాలుగా రియాక్షన్స్ ఇస్తున్నారు.
విరాట్ దగ్గర అనుష్కను చూసి చాలా మంది యూజర్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా కోహ్లి అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట్ తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 7 డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో పాటు 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు.
Also Read: Watch Video: బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన పొలార్డ్.. అలా బ్యాటింగ్ చేస్తావా అంటూ.. వైరల్ వీడియో
Watch Video: టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్పెషల్ ‘సెంచరీ’.. సన్మానించిన రాహుల్ ద్రవిడ్