
India vs New Zealand ODI: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా కేవలం 89 పరుగులకే కుప్పకూలడంపై భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కివీస్ నిర్దేశించిన 334 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత్ 26.4 ఓవర్లలోనే ఆలౌట్ కావడంతో, 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన గంభీర్, ఈ ఓటమికి పిచ్ లేదా వాతావరణ పరిస్థితులను ఏ మాత్రం నిందించబోనని స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేని బంతులు అంటూ ఏమీ ఉండవని, బ్యాటర్లే మరింత బాధ్యతాయుతంగా ఆడి తొలి పది ఓవర్లను జాగ్రత్తగా నెట్టుకురావాలని చురకలు అంటించాడు. 90 పరుగుల లోపే జట్టు కుప్పకూలడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి ప్రదర్శన సరికాదని పేర్కొన్నాడు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ 5th ODI: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హమ్మయ్య చివరి వన్డే ఇక మనదే.. ఆ దరిద్రం పోయిందిగా..!
సీమ్ కంటే న్యూజిలాండ్ బౌలర్లు వేసిన లైన్ అండ్ లెంగ్త్ మన బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టాయని గంభీర్ విశ్లేషించాడు. క్రీజులోనే ఉండకపోవడం వల్ల బ్యాటర్లు త్వరగా వికెట్లు సమర్పించుకున్నారని తెలిపాడు. మొత్తంగా టాప్ ఆర్డర్ నిలకడ లేని ఆటతోనే ఈ ఓటమికి ప్రధాన కారణమని గంభీర్ చెప్పకనే చెప్పాడు.
ఎక్కువమంది చదివినది: Year Ender 2026: 11 సిక్సర్లు, 9 ఫోర్లు.. 30 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. రోహిత్ రికార్డును చెరిపేసిన అభిషేక్ శర్మ..!
సవాలుతో కూడిన పిచ్‌లపై ఆడేందుకు బ్యాటర్లు మానసికంగా, సాంకేతికంగా మరింత సిద్ధంగా ఉండాలని గంభీర్ సూచించాడు. అనుభవజ్ఞులు ఉన్నందున చివరి వన్డేలో పుంజుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..