నాలుగో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు భారత్ అద్భుతంగా పుంజుకుంది. నాలుగో రోజు కూడా భారత్ మంచి ప్రదర్శన చేసింది. కానీ చివరి సెషన్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌లు చేతులు ఎత్తేయడంతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌ను కైవసం చేసుకుని ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. దీంతో సిరీస్‌ను కాపాడుకోవడం ఇప్పుడు భారత్‌కు పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సంబంధించిన లెక్కలు కూడా తారుమారయ్యాయి. ఫైనల్ కల దాదాపుగా చెదిరిపోయిందని చెప్పవచ్చు. ఐతే నాలుగో మ్యాచ్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ నిరాశగా కనిపించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఐదో మ్యాచ్ జనవరి 3 నుంచి జరగనుంది.
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్న జట్టుగా రాణించగల అవకాశం ఉందని.. ఈ మ్యాచ్‌ని బాగా ఆడేందుకు ప్రయత్నిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. సిరీస్‌ను సమం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రాను ప్రశంసించాడు. ఈ సందర్బంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘బుమ్రా నిజంగా మంచి బౌలర్. మీరు అతన్ని చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. మీరు అతని ప్రదర్శనను కూడా నాలుగో టెస్టులో చూడవచ్చు. బుమ్రా జట్టును గెలిపించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతనిని వేరే బౌలర్ల నుంచి సరైన మద్దతు రావడం లేదని” పేర్కొన్నాడు. అలాగే తన ప్రదర్శనపై రోహిత్ శర్మ స్పందించాడు. “కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా కొన్ని ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఇది నిరాశపరిచింది. మానసికంగా ఇబ్బంది పెడుతోంది. జట్టుగా కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Rohit Sharma on Yashasvi Jaiswal’s dismissal:
“It didn’t show in Snicko, but with the naked eyes there was a deflection. In all fairness, it looked like he touched it, but more often than not we fall on the wrong side of the decisions”. pic.twitter.com/2qQH01McGX
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024
బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి నిరాశపరిచిందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. నితీశ్ కూమార్ మంచి ఫ్యూచర్ ఉందని కొనియాడారు. 340 రన్స్ అంటే అంత ఈజీ కాదని, ఇంకా జట్టు ఇంప్రూవ్ కావాలని పేర్కొన్నాడు. సీడ్నీలో టెస్టులో మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Rohit Sharma said “I stand where I am standing today – Few results didn’t go our way as a captain and batter it is disappointing – mentally its disturbing but as of now that is where it is, there are things we as a team and I need to look at”. [Press] pic.twitter.com/iNkkpq34aQ
— Kanak Kumari (@KanakKu64995524) December 30, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి