T20 World Cup 2026 : ఈడెన్ గార్డెన్స్ లో అసలైన సమరం.. కివీస్ పగ తీర్చుకుంటుందా.. ప్రొటీస్ జైత్రయాత్ర సాగుతుందా?

New Zealand vs South Africa : రేపు (మార్చి 4) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు మొదటి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. సాధారణంగా క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ రైవల్రీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కివీస్ వర్సెస్ ప్రొటీస్ మధ్య ఉన్న రికార్డులు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.

T20 World Cup 2026 : ఈడెన్ గార్డెన్స్ లో అసలైన సమరం.. కివీస్ పగ తీర్చుకుంటుందా.. ప్రొటీస్ జైత్రయాత్ర సాగుతుందా?
New Zealand Vs South Africa

Updated on: Mar 03, 2026 | 1:15 PM

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెమీఫైనల్ సమరం మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. రేపు (మార్చి 4) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు మొదటి సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. సాధారణంగా క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ రైవల్రీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కివీస్ వర్సెస్ ప్రొటీస్ మధ్య ఉన్న రికార్డులు చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. గణాంకాల ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ సౌతాఫ్రికానే విజయం వరించింది. ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గెలవలేకపోయింది. ఈ సెమీఫైనల్‌లో గెలవాలంటే న్యూజిలాండ్ కేవలం సౌతాఫ్రికాతోనే కాదు, ఆ భయంకరమైన చరిత్రతో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఒకవైపు చోకర్స్ ముద్ర పోగొట్టుకోవాలని సౌతాఫ్రికా, మరోవైపు ఐసీసీ టోర్నీల్లో సెమీస్ గండం దాటాలని కివీస్ పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుత టోర్నీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్-బీటన్ టీమ్‌గా సెమీస్‌కు రావడం విశేషం.

వీరి మధ్య పోరు 2007లో మొదలైంది. తొలి వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ఆ తర్వాత 2009లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 1 పరుగు తేడాతో, 2010లో 13 పరుగుల తేడాతో, 2014లో కేవలం 2 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఉత్కంఠభరిత విజయాలను అందుకుంది. ఇక ప్రస్తుత 2026 వరల్డ్ కప్ గ్రూప్ దశలో తలపడినప్పుడు కూడా 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టు ఈజీగా గెలిచేసింది. దీన్ని బట్టి చూస్తే న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికాకు ఉన్న ఆధిపత్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే, ఈ సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ తక్కువ అంచనా వేయలేం. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని బ్లాక్ క్యాప్స్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒత్తిడిని జయించి చరిత్రను తిరగరాయాలని వారు భావిస్తున్నారు. మరోవైపు ఐడెన్ మార్క్రామ్ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో, ఇరు జట్ల స్పిన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. మరి రేపు రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ పోరులో కివీస్ పగ తీర్చుకుంటుందా? లేక సౌతాఫ్రికా తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా? అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us