SA vs NZ: సెమీస్ వరకు తోపులు.. కట్‌చేస్తే.. కివీస్‌పై ఓటమితో మరోసారి ‘ఛోకర్స్’గా సౌతాఫ్రికా

South Africa vs New Zealand, 1st Semi-Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘోర పరాజయం పాలైంది. ఒక్క ఓటమి లేకుండా ఇక్కడి వరకు వచ్చిన సౌతాఫ్రికా.. మరోసారి ఛోకర్స్‌గానే మిగిలిపోవడం గమనార్హం.

SA vs NZ: సెమీస్ వరకు తోపులు.. కట్‌చేస్తే.. కివీస్‌పై ఓటమితో మరోసారి ఛోకర్స్గా సౌతాఫ్రికా
Sa Vs Nz Result

Updated on: Mar 04, 2026 | 10:04 PM

South Africa vs New Zealand, 1st Semi-Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన  తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. కేవలం 12.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి సాధించింది. న్యూజిలాండ్ తరపున ఫిన్ ఆలెన్ 100 పరుగులు, టిమ్ షెపర్డ్ 58 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. మరో బ్యాటర్ రచన్ రవీంద్ర 13 పరుగులతో నిలిచాడు. కాగా, ఫిల్ ఆలెన్ 8 సిక్స్‌లు, 10 ఫోర్లతో సెంచరీ బాదేశాడు. ఇందులో 303 స్ట్రైక్ రేట్‌తో దుమ్మురేపాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ చేరుకుంది.

అంతకుముందు దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ 30 బంతుల్లో అజేయంగా 55 పరుగులు చేశాడు. అతను ఆరో వికెట్‌కు ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి 48 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం ఆఫ్రికన్ జట్టు 150 పరుగులు దాటడానికి సహాయపడింది.

ఒక దశలో జట్టు 5 వికెట్లకు 77 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున మాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, రాచిన్ రవీంద్ర తలా 2 వికెట్లు పడగొట్టారు.

కాగా, సెమీస్ వరకు ఓటమి లేకుండా దూసుకొచ్చిన సౌతాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. అలాగే, బ్యాటింగ్‌లోొనూ తడబడింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యారు. ఒక్క రబడా తప్ప మరెవరూ వికెట్ సాధించలేకపోయారు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

దక్షిణాఫ్రికా:

ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి.

న్యూజిలాండ్:

ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్, లాకీ ఫెర్గూసన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us