కోచ్‌లు నిద్రపోతున్నారా.. చెత్త బౌలింగ్, పరమ చెత్త ఫీల్డింగ్.. ఆ ఇద్దర్ని పీకేస్తే దరిద్రం పోద్ది..!

Sunil Gavaskar Comments on Team India Bowling performance: వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలు ఓటమికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పాటు కెప్టెన్ వ్యూహాలు లేకపోవడాన్ని గవాస్కర్ తప్పుపట్టారు.

కోచ్‌లు నిద్రపోతున్నారా.. చెత్త బౌలింగ్, పరమ చెత్త ఫీల్డింగ్.. ఆ ఇద్దర్ని పీకేస్తే దరిద్రం పోద్ది..!
Ind Vs Wi Sunil Gavaskar Comments

Updated on: Oct 16, 2026 | 6:04 PM

Sunil Gavaskar Comments on Team India Bowling performance: వెస్టిండీస్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమికి ఫీల్డింగ్, బౌలింగ్ వైఫల్యాలే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్‌లో ఈ రెండు సమస్యలే నాల్గవ మ్యాచ్‌లోనూ పునరావృతమయ్యాయని గవాస్కర్ పేర్కొన్నారు.

భారత జట్టు బ్యాటింగ్‌లో సంజు శాంసన్ హాఫ్ సెంచరీ, తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ (43), నితీష్ కుమార్ రెడ్డి (41), అభిషేక్ శర్మ (29) పరుగులతో పోరాడినప్పటికీ, 248 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16), ఇషాన్ కిషన్ (6), నమన్ ధీర్ (0), అక్షర్ పటేల్ (3) వంటి కీలక బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. అయితే చివరి వరకు పోరాడినప్పటికీ జట్టు గెలవలేకపోవడానికి ప్రధాన కారణం టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యమే అని గవాస్కర్ విశ్లేషించారు.

అందివచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోవడం, సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోవడం, అందుకు తగ్గ వ్యూహాలు, బౌలర్లకు కెప్టెన్ నుంచి సూచనలు లేకపోవడం మ్యాచ్ ఓటమికి కారణమయ్యాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్లు దారుణంగా పరుగులు ఇస్తున్నప్పటికీ, వారి దగ్గరికి వెళ్లి సలహాలు ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయని గవాస్కర్ అన్నారు. స్వదేశంలో ఆడుతున్నప్పటికీ బౌలింగ్‌లో నియంత్రణ లేకపోవడంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మయాంక్ యాదవ్ ఏకంగా నాలుగు ఓవర్లలో 50కి పైగా పరుగులు సమర్పించుకోగా, నమన్ ధీర్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చారు. డెత్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోవడం వెస్టిండీస్ భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది.

వెస్టిండీస్ బౌలర్లు పిచ్‌కి తగ్గట్టుగా బంతులు వేస్తే, టీమిండియా బౌలర్లు, ముఖ్యంగా మయాంక్ యాదవ్, పిచ్చోడిలా ఒకే స్పీడ్‌తో బౌలింగ్ చేసి కొంప ముంచారని గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌తో పాటు రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అంతకుముందు నమన్ ధీర్ కూడా రూథర్‌ఫోర్డ్ క్యాచ్‌ను డ్రాప్ చేయడం గమనార్హం. అంతేకాకుండా, లాంగ్ ఆన్‌లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్‌లను సరిగా అందుకోలేకపోయారు. ఈ ఫీల్డింగ్ తప్పిదాలన్నీ భారత ఓటమిలో కీలక పాత్ర పోషించాయని గవాస్కర్ అన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బౌలింగ్, ఫీల్డింగ్ టీమిండియా ఓటమికి శాపంగా మారాయని, దీనికి బౌలింగ్ కోచ్, కెప్టెన్‌లే బాధ్యులని సునీల్ గవాస్కర్ అన్నారు. బౌలింగ్ విధానాలు సరిగ్గా లేవని, అలాగే ఫీల్డింగ్ కోచ్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఫీల్డ్‌లో బౌలర్లు నియంత్రణ లేకుండా బౌలింగ్ చేస్తున్నప్పుడు, కెప్టెన్ వారి దగ్గరికి వెళ్లి సూచనలు చేస్తూ ఫీల్డింగ్‌లో మార్పులు తేవాలని గవాస్కర్ స్పష్టం చేశారు. టీమిండియా బౌలర్ల కంటే వెస్టిండీస్ బౌలర్లే చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారని పేర్కొంటూ టీం మేనేజ్‌మెంట్‌పై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us