SRH vs RR Qualifier 2, IPL 2024: ఐపీఎల్ క్వాలిఫయర్-2 రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ప్లేయింగ్-11లో జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు జైదేవ్ ఉనద్కత్, ఐడెన్ మార్క్‌రామ్‌లకు హైదరాబాద్ అవకాశం కల్పించింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అక్కడ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్‌లో ఓడిన జట్టు ప్రయాణం ఇక్కడితో ముగియనుంది.
🚨 Toss Update 🚨
Rajasthan Royals elect to bowl against Sunrisers Hyderabad.
Follow the Match ▶️ https://t.co/Oulcd2G2zx#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCall pic.twitter.com/LMIQIBLEyf
— IndianPremierLeague (@IPL) May 24, 2024
2016 ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ 7వ సారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. హైదరాబాద్ జట్టు 2013లో తొలిసారి ప్లేఆఫ్‌కు చేరుకుంది. అది ఆజట్టు తొలి సీజన్. SRH ఇప్పుడు 2020 తర్వాత ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ఇప్పటివరకు, SRH 6 ప్లేఆఫ్‌లలో 2 సార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. 2016లో గెలిచిన హైదరాబాద్.. 2018లో రన్నరప్‌గా నిలిచింది. SRH ప్లేఆఫ్స్‌లో 3 సార్లు క్వాలిఫయర్-2 ఆడింది. 2 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది.
ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్ గెలిచిన రాజస్థాన్.. 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఈ జట్టు ఆరోసారి ప్లేఆఫ్ రౌండ్‌కు చేరుకుంది. రాయల్స్ మూడోసారి క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఇంతకు ముందు ఒక విజయం, ఒక ఓటమిని కలిగి ఉంది. 2022లో కూడా క్వాలిఫయర్-2లో ఆర్‌సీబీని ఓడించిన తర్వాతే ఆ జట్టు ఫైనల్ ఆడింది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి. నటరాజన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ఉమ్రాన్ మాలిక్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్.
రాజస్థాన్ రాయల్స్: షిమ్రాన్ హెట్మేయర్, నాంద్రే బర్గర్, శుభమ్ దూబే, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..