
SRH Retention List: ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 16న గోవాలో వేలం జరిగే అవకాశం ఉండటంతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. నవంబర్ 17లోపు ఆటగాళ్లను కొనసాగించాలా? విడుదల చేయాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యజమాని కావ్య మారన్ (Kavya Maran) ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి వీడ్కోలు చెబుతారు? అనే చర్చ జరుగుతోంది.
రిటెన్షన్ జాబితా ఖరారు చేసే ముందే హైదరాబాద్ జట్టు ట్రేడింగ్ ద్వారా కీలక మార్పులు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టీ నటరాజన్ (T Natarajan)ను జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం జీషాన్ అన్సారీని ట్రేడ్ చేసినట్లు సమాచారం. నటరాజన్ కోసం రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినది: మొన్న 185, నిన్న 134.. రేపు 100కే ఆలౌట్ చేస్తారేమో.. భారత బౌలర్లను చూస్తే భయమేస్తోంది..!
అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ట్రేడ్‌లో భాగంగా లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను పంపించి ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed), నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)లను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఖలీల్ గతంలోనూ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పుడు మళ్లీ తన పాత జట్టులోకి వచ్చాడు. అతడి ధర రూ.4.8 కోట్లు కాగా, నాథన్ ఎల్లిస్‌కు రూ.2 కోట్లు కేటాయించినట్లు కథనం పేర్కొంది.
హైదరాబాద్ జట్టు ప్రధానంగా తన విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan), ట్రావిస్ హెడ్ (Travis Head), హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)లకు రిటెన్షన్ దక్కే అవకాశం ఉంది.
వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, సలిల్ అరోరా, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ ఆటగాళ్లను కూడా కొనసాగించే అవకాశముంది.
SRH అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి రేపుతున్న అంశం కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) భవిష్యత్తు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు క్రికెట్‌తో పాటు వన్డే ప్రపంచకప్ బాధ్యతలు ఉండటంతో అతడి అందుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతడు వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండలేనని ఫ్రాంచైజీకి తెలియజేస్తే విడుదల చేసే అవకాశం ఉందని కథనం పేర్కొంది.
ఎక్కువమంది చదివినది: కోహ్లీపైకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ చేసిన పనితో అంతా ఫిదా..!
ఇక హర్షల్ పటేల్ (Harshal Patel), జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat), దిల్షాన్ మధుశంక, ఆర్ఎస్ అంబ్రిష్, అనికేత్ వర్మ, ఓంకార్ తరమలే, శివమ్ మావి కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో ఉన్నట్లు సమాచారం.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, సలిల్ అరోరా, శివాంగ్ కుమార్, క్రేన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, అమిత్ కుమార్, స్మరణ్ రవిచంద్రన్.
పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మధుశంక, ఆర్ఎస్ అంబ్రిష్, అనికేత్ వర్మ, ఓంకార్ తరమలే, శివమ్ మావి.
ఈ జాబితాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. హైదరాబాద్ ఫ్రాంచైజీ అధికారిక రిటెన్షన్ ప్రకటనతోనే ఎవరెవరు జట్టులో కొనసాగుతారనే విషయంలో స్పష్టత రానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..