Video: ఆసియా కప్‌లో పాముల బెడద.. ఆటగాళ్ల భద్రపై ఆందోళన.. ఐపీఎల్‌ టెక్నిక్స్ పాటిస్తే బెటర్ అంటోన్న నిపుణులు..

|

Aug 15, 2023 | 9:21 AM

శ్రీలంకలో జరుగుతున్న T20 లీగ్‌లో, కొన్నిసార్లు పాములు గ్రౌండ్‌లోకి వచ్చినట్లు చూశాం. కొన్నిసార్లు అవి జట్టు డగౌట్ దగ్గర కనిపించడం చూశాం. ఇవి ఎంతో విషపూరితమైనది. ఇవి కాటువేస్తే చాలా ప్రమాదం కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక బోర్డ్ ఏం చేస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

Video: ఆసియా కప్‌లో పాముల బెడద.. ఆటగాళ్ల భద్రపై ఆందోళన.. ఐపీఎల్‌ టెక్నిక్స్ పాటిస్తే బెటర్ అంటోన్న నిపుణులు..
Snake In Asia Cup
Follow us on

శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్‌లో పాముల బెడద ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల భద్రత పెద్ద ప్రశ్నగా మారింది. ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి జరగనుంది. ఇందులో 6 దేశాల ఆటగాళ్లు మైదానంలో కనిపిస్తుంటారు. కానీ, అంతకుముందే అక్కడి క్రికెట్ గ్రౌండ్‌లో పాములు భీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో పాములు 2-3 సార్లు మైదానంలోకి రావడం కనిపించింది. లీగ్‌లో ఆడుతున్న ఆటగాళ్లు తృటిలో తప్పించుకోవడం కనిపించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మ్యాచ్ సమయంలో ఆటగాళ్లకు పాములు ఎదురుకాకుండా చూసేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఏమి చేస్తోంది?

ఆసియా కప్ మ్యాచ్‌ల సమయంలో పాములు మైదానంలోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ? లంక ప్రీమియర్ లీగ్‌లో పాముల కేసుల సంఖ్యను బట్టి చూస్తే.. శ్రీలంక క్రికెట్ బోర్డు దీనిపై ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్‌ల సమయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగితే, శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఇవి కూడా చదవండి

LPL 2023లో పాముల కలకలం..

శ్రీలంకలో జరుగుతున్న T20 లీగ్‌లో, కొన్నిసార్లు పాములు గ్రౌండ్‌లోకి వచ్చినట్లు చూశాం. కొన్నిసార్లు అవి జట్టు డగౌట్ దగ్గర కనిపించడం చూశాం. ఇవి ఎంతో విషపూరితమైనది. ఇవి కాటువేస్తే చాలా ప్రమాదం కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక బోర్డ్ ఏం చేస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో కామెంట్స్..

శ్రీలంక క్రికెట్ బోర్డు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. లంక ప్రీమియర్ లీగ్‌లో పాములు కనిపించినట్లే.. ఆసియా కప్ సమయంలో మైదానంలోకి పాములు రాకుండా ఎలాంటి పద్ధతులను అవలంభిస్తున్నారో చెప్పాలని కోరుతున్నారు.

పాములను ఎదుర్కోవడానికి శ్రీలంక ఏమి చేయాలి?


మైదానంలో పాముల బెడదను ఎదుర్కోవడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు యాంటీ స్నేక్ రసాయనాలను స్ప్రే చేయాలి. భారతదేశంలోని అస్సాంలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్‌ల సమయంలో సరిగ్గా ఇదే పద్ధతిని ఉపయోగించారు. అస్సాంలోని బరస్పరా స్టేడియం పాములకు నిలయంగా మారుతుంటుంది. కానీ, ఐపీఎల్ సమయంలో యాంటీ స్నాక్ కెమికల్స్ చల్లడం వల్ల పాములు కనిపించలేదు. ఇది కాకుండా శ్రీలంక క్రికెట్ బోర్డు ఇతర పద్ధతులను కూడా పరిశీలించాలి. ఈ విషయమై స్నేక్ నిపుణులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

నెటిజన్ల ట్వీట్స్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..