Video: 17 సిక్సర్లతో 201 పరుగులు.. తుఫాన్ ఆటతో ఛాంపియన్‌గా మారిన ఐపీఎల్‌ డేంజరస్ ప్లేయర్..

|

Aug 19, 2024 | 5:49 PM

ఓవల్ ఇన్విన్సిబుల్స్ ది హండ్రెడ్ టోర్నమెంట్ ఆఫ్ ఇంగ్లండ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటిల్ పోరులో ఈ జట్టు సదరన్ బ్రేవ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్ 100 బంతుల్లో 147 పరుగులు చేయగా, సదరన్ బ్రేవ్ జట్టు 130 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టోర్నీని ఓవల్ ఇన్విన్సిబుల్స్ గెలవడంలో ఆల్ రౌండర్ శామ్ కుర్రాన్ కీలక పాత్ర పోషించాడు.

Video: 17 సిక్సర్లతో 201 పరుగులు.. తుఫాన్ ఆటతో ఛాంపియన్‌గా మారిన ఐపీఎల్‌ డేంజరస్ ప్లేయర్..
Sam Curran
Follow us on

Oval Invincibles vs Southern Brave: ఓవల్ ఇన్విన్సిబుల్స్ ది హండ్రెడ్ టోర్నమెంట్ ఆఫ్ ఇంగ్లండ్‌పై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటిల్ పోరులో ఈ జట్టు సదరన్ బ్రేవ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్ 100 బంతుల్లో 147 పరుగులు చేయగా, సదరన్ బ్రేవ్ జట్టు 130 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టోర్నీని ఓవల్ ఇన్విన్సిబుల్స్ గెలవడంలో ఆల్ రౌండర్ శామ్ కుర్రాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడమచేతి వాటం ఆటగాడు బంతి, బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి తన జట్టును ఛాంపియన్‌గా మార్చాడు. ది హండ్రెడ్‌లో సామ్ కుర్రాన్ బాల్, బ్యాట్‌తో ఎలా రాణించాడో ఓసారి చూద్దాం..

సామ్ కర్రాన్ ప్రదర్శన..

ది హండ్రెడ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున శామ్ కుర్రాన్ 6 ఇన్నింగ్స్‌ల్లో 201 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 40.20లుగా నిలిచింది. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఆటగాడి అద్భుత ప్రదర్శన ఇది. సామ్ కుర్రాన్ గురించిన పెద్ద విషయం ఏమిటంటే, ఈ ఆటగాడు టోర్నీలో 17 సిక్సర్లు కొట్టాడు. అతని బ్యాట్ నుంచి 7 ఫోర్లు వచ్చాయి. అంటే శామ్ కుర్రాన్ బౌలర్లపై లాంగ్ షాట్లు ఎక్కువగా ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ దాదాపు 165కి చేరుకోవడానికి ఇదే కారణం.

సామ్ కుర్రాన్ బౌలింగ్ మరింత పదునుగా ఉంది. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 9 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా తర్వాత జట్టులో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. జంపా అతని కంటే 2 వికెట్లు ఎక్కువగా 19 వికెట్లు తీశాడు. కానీ, బాల్, బ్యాటింగ్‌లో అతని అద్భుతమైన సహకారం కారణంగా సామ్ కుర్రాన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సామర్థ్యం కారణంగా, సామ్ కుర్రాన్ ఐపీఎల్‌లో కూడా చాలా డబ్బును పొందుతున్నాడు. పంజాబ్ కింగ్స్ అతనికి ప్రతి సీజన్‌లో రూ.18.5 కోట్లు ఇస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రూ.55 కోట్లు సంపాదించాడు.

జేమ్స్ విన్స్ టాప్ బ్యాట్స్‌మెన్‌గా..

ది హండ్రెడ్‌లో అత్యధిక పరుగులు జేమ్స్ విన్స్ బ్యాట్ నుంచి వచ్చాయి. ఈ సదరన్ బ్రేవ్ బ్యాట్స్‌మెన్ 10 మ్యాచ్‌ల్లో 424 పరుగులు చేశాడు. అతను తన బ్యాట్‌తో 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అయినప్పటికీ అతని ప్రదర్శన ఫైనల్‌లో అతని జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయింది. బౌలింగ్‌లో ఆడమ్ జంపా అత్యధికంగా 19 వికెట్లు పడగొట్టాడు. సదరన్ బ్రేవ్ ఫాస్ట్ బౌలర్ టిమల్ మిల్స్ కూడా 19 వికెట్లు పడగొట్టాడు. అయితే, అతని ఎకానమీ రేటు జంపా కంటే చాలా ఎక్కువగా ఉంది. అతను మరో మ్యాచ్ కూడా ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..