Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

Saaniya Chandhok: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ నుంచి ఓ ఆసక్తికరమైన, మైండ్ బ్లోయింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. సచిన్ కోడలు, అర్జున్ టెండూల్కర్ భార్య సానియా చందోక్ తన వృత్తిపరమైన జీవితంలో ఓ కీలక ఘనత సాధించారు. మూగజీవాల పట్ల ఉన్న ప్రేమను కేవలం హాబీకే పరిమితం చేయకుండా డాక్టర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు
Saaniya Chandhok

Updated on: Aug 20, 2026 | 6:57 AM

Saaniya Chandhok: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వారసుడిగా అర్జున్ టెండూల్కర్ మైదానంలో ఓ వైపు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే, ఆయన భార్య సానియా చందోక్ మాత్రం క్రికెట్‎కు దూరంగా పూర్తిగా భిన్నమైన మార్గాన్నిఎంచుకున్నారు. మూగజీవాల సంరక్షణ, వాటి ఆరోగ్య రక్షణ మీద తనకున్న అమితమైన ఇష్టంతో వృత్తిపరమైన శిక్షణ పూర్తి చేశారు. వరల్డ్‌వైడ్ వెటర్నరీ సర్వీస్ నిర్వహించిన ఏబీసీ ప్రోగ్రామ్ ద్వారా సర్టిఫైడ్ వెటర్నరీ టెక్నీషియన్‌గా అధికారిక అర్హత సాధించి సరికొత్త మైలురాయిని చేరుకున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

ఈ ప్రత్యేక మైలురాయిని సాధించిన విషయాన్ని సానియా స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఒక క్లినికల్ వాతావరణంలో కుక్కకు ఎంతో ప్రేమతో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా వ్యాపార, సెలబ్రిటీ నేపథ్యం ఉన్నవారు ఇలాంటి కష్టతరమైన మెడికల్ ట్రైనింగ్ తీసుకోవడం అరుదు. అయితే సానియా మాత్రం ప్రాథమిక వైద్య విధానాలు, మూగజీవాల అత్యవసర చికిత్స విభాగాల్లో సుదీర్ఘంగా శిక్షణ పొంది నిజమైన జంతుప్రేమికురాలని నిరూపించుకున్నారు.

 

ఇది కూడా చదవండి: Ravindra Jadeja: నో బాల్ పాపానికి ప్రాయశ్చిత్తం.. 131 బంతుల తర్వాత తప్పు సరిదిద్దుకున్న జడేజా 

మెచ్చుకున్న టెండూల్కర్ కుటుంబం

సానియా సాధించిన ఈ గుర్తింపుపై టెండూల్కర్ కుటుంబ సభ్యులతో పాటు ఆమె ఫాలోవర్లు విశేషంగా స్పందిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఈ పోస్ట్‌ను లైక్ చేసి తన వదినకు అభినందనలు తెలిపారు. సచిన్ సోదరి కూడా ఈ ఆనందకర విషయాన్ని మెచ్చుకుంటూ స్పందించడం విశేషం. ఇంట్లో ఉన్న ఆడపడుచులు, కుటుంబ పెద్దలు సానియా ఆశయాన్ని ప్రోత్సహించడంతో నెటిజన్లు కూడా టెండూల్కర్ ఫ్యామిలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సొంత వ్యాపారంతో పాటు డాక్టర్‌గా ప్రయాణం

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన సానియా చందోక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. వ్యాపారవేత్తగా మిస్టర్ పాస్ పేరుతో పెట్ స్పా, గ్రూమింగ్ కేర్ సెంటర్‌ను ముంబైలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కేవలం వ్యాపారాన్నే కాకుండా, సాంకేతిక వైద్య పరిజ్ఞానాన్ని కూడా సొంతం చేసుకోవాలనే తపనతోనే ఈ వెటర్నరీ సర్టిఫికేషన్ సాధించారు. ఒకపక్క అర్జున్ క్రికెట్ కెరీర్‌లో బిజీగా ఉంటే, సానియా మాత్రం పెట్ సంరక్షణ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ENG vs PAK: అదో పనికి రాని చెత్త టీమ్.. పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ దిగ్గజం నోటిదురద

Loading...
Unable to load recommendations.
Follow Us