
Rishabh Pant Fastest 100 Test Sixes: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ తనదైన దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తూ 66 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ క్రమంలో లంక పేసర్ లహిరు కుమార వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలిచి తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అదే షాట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో 100వ సిక్సర్‌ను తన ఖాతాలో వేసుకుని మైదానాన్ని హోరెత్తించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
సుదీర్ఘ టెస్టు ఫార్మాట్ చరిత్రలో అత్యంత వేగంగా వంద సిక్సర్ల మైలురాయిని చేరిన ప్రపంచ రికార్డు ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్‌క్రిస్ట్ ఈ మార్కును చేరుకోవడానికి 130 ఇన్నింగ్స్‌లు తీసుకోవడం విశేషం.
భారత స్టార్ బ్యాటర్ పంత్ కేవలం 89 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ అరుదైన ఫీట్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన నలుగురు బ్యాటర్లలో పంత్ చేరడం విశేషం.
రిషభ్ పంత్ (భారత్) – 89 ఇన్నింగ్స్‌లు
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 130 ఇన్నింగ్స్‌లు
బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) – 151 ఇన్నింగ్స్‌లు
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) – 170 ఇన్నింగ్స్‌లు
Maximum number 1⃣0⃣0⃣ in Test Cricket for Rishabh Pant! 💥
He becomes the first #TeamIndia batter to reach that special milestone in men’s cricket 🫡🫡
Updates ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/24yVuJ7FzX
— BCCI (@BCCI) August 18, 2026
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఇంగ్లాండ్ మాజీ సారథి బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన తర్వాత న్యూజిలాండ్ మాజీ విధ్వంసకర బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ 107 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం పంత్ 100 సిక్సర్లతో గిల్‌క్రిస్ట్ సరసన చేరాడు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్న పంత్, మెకల్లమ్ అలాగే స్టోక్స్ రికార్డులను సైతం త్వరలోనే అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
FIFTY for Rishabh Pant! ✅
He brings up his 20th Test half-century as #TeamIndia move closer to 160. 👍
Updates ▶️ https://t.co/WHXkfnivbw#SLvIND pic.twitter.com/qq6IlmSHbL
— BCCI (@BCCI) August 18, 2026
భారత టెస్టు క్రికెట్‌లో పవర్ హిట్టింగ్‌కు సరికొత్త నిర్వచనం చెబుతోన్న రిషభ్ పంత్.. ఈ ప్రపంచ రికార్డుతో ఎంతోమంది యువ క్రికెటర్లకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. రానున్న టెస్టు సిరీస్‌లలో పంత్ మరింత దూకుడు కొనసాగిస్తే ప్రపంచంలోనే అత్యధిక సిక్సర్ల రికార్డును కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ వర్సెస్ శ్రీలకం తొలి టెస్ట్ లైవ్ స్కోర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..