AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6,6,6,6,6.. అనామక బౌలర్ అనుకునేరు.. సిక్సర్ల సికిందర్ అంటారురా బాబూ.. ఎవరంటే.?

ఉత్తరప్రదేశ్ లీగ్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వరుస సిక్సర్లతో రెచ్చిపోయారు. ఈ తరుణంలో కేకేఆర్ మాజీ ప్లేయర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ ఛీ కొడితే.. ఈ లీగ్‌లో తన ప్రతాపం చూపించాడు. మరి ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా. ఆ వివరాలు..

6,6,6,6,6.. అనామక బౌలర్ అనుకునేరు.. సిక్సర్ల సికిందర్ అంటారురా బాబూ.. ఎవరంటే.?
Shivam
Ravi Kiran
|

Updated on: Aug 19, 2025 | 1:59 PM

Share

ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో కాశీ రుద్రాస్ టీం బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. గౌర్ గోరఖ్‌పూర్ లయిన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదారు. శివమ్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో తొలి 3 బంతులను శివ సింగ్ సిక్సర్లు బాదగా, 5,6 బంతులను శివమ్ మావీ సిక్సర్లుగా మలిచారు. ఒక సింగిల్‌తో కలిపి ఆ ఓవర్‌లో మొత్తం 31 రన్స్ వచ్చాయి. ఈ మ్యాచ్‌లో శివమ్ మావి 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 257 స్ట్రైక్ రేట్‌తో ఆడిన మావి మొత్తంగా 21 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  54 పరుగులలో 36 పరుగులు సిక్సర్ల రూపంలో రాబట్టాడు. అటు కేఆర్డీ కెప్టెన్ కరణ్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేయడంతో.. ఆ జట్టు 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.

ఇదిలా ఉండగా.. కాశీ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మావి, శివ సిక్సర్లు కొట్టారు. వీరిద్దరూ కలిసి ఆరు బంతుల్లో ఐదు బంతులను బౌండరీ లైన్ దాటించారు. శివ మొదటి మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదగా.. నాల్గవ బంతిని సింగిల్ తీసి.. మావి చివరి రెండు బంతుల్లో మరో రెండు సిక్సర్లు కొట్టాడు. శివ సింగ్ 17 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి వాసు వాట్స్ బౌలింగ్‌లో శివమ్ మావి అవుట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మావి చివరిసారిగా జనవరిలో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు సంవత్సరాలుగా అతను ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో గౌర్ గోరఖ్‌పూర్ లయిన్స్ లక్ష్యచేధనలో చతికిలబడింది కేవలం 126 పరుగులకే ఆలౌట్ అయింది.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా