IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

IPL 2027 Retention: ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలను ఖరారు చేశాయి. దిగ్గజ కెప్టెన్ ధోనీని వదిలి చెన్నై సంచలనం సృష్టించగా, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ కీలక మార్పులు చేశాయి. ఏ జట్టు ఎవరిని నిలుపుకుంది, వదులుకుంది, పర్సులో ఎంత మిగిలిందో ఇప్పుడు చూద్దాం..

IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?
Ipl 2027 Retention All 10 Teams

Updated on: Nov 18, 2026 | 4:22 PM

IPL 2027 Retention: ఎట్టకేలకు వేచి చూసిన సమయం రానే వచ్చింది. ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు రిటెన్షన్ పర్వం అధికారికంగా ముగిసింది. పది ఫ్రాంచైజీలు తమ కోర్ గ్రూప్‌ను ఖరారు చేసుకున్నాయి. కొన్ని జట్లు స్థిరత్వానికే పట్టం కట్టగా, మరికొన్ని జట్లు జేబు నిండా డబ్బుతో వేలంలోకి దిగేందుకు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈసారి రిటెన్షన్‌లో అతిపెద్ద వార్త ఒక్కటే – చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీని రిలీజ్ చేయడం. రూ.4 కోట్లకు ధోనీని వదిలిపెట్టిన చెన్నై, ఆయనను మెంటార్‌గా కొనసాగించనుంది. దీంతో ఓ యుగానికి తెరపడినట్లేననే భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ధోనీతో పాటు ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి స్టార్లు కూడా వేలంలోకి రానున్నారు. ఎవరు ఎవరిని అట్టిపెట్టుకున్నారు. ఎవరిని వదిలేశారు, ఏ జట్టు వద్ద ఎంత పర్సు మిగిలిందనే పూర్తి లెక్కలు ఓసారి చూద్దాం..

1. చెన్నై సూపర్ కింగ్స్ – ధోనీ లేని కొత్త శకం:

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో యువతకే పట్టం కట్టింది చెన్నై. సంజూ శాంసన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, నూర్ అహ్మద్‌లను నిలుపుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను ట్రేడ్ ద్వారా తెచ్చుకుంది. ప్రశాంత్ వీర్ (రూ.14.2 కోట్లు)ను వదిలి పెద్ద మొత్తం ఆదా చేసింది.

నిలుపుకున్న జాబితా: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఊర్విల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అన్షుల్ కాంబోజ్, అకీల్ హొసేన్, ముకేశ్ చౌదరి, రాహుల్ చాహర్, శ్రేయస్ గోపాల్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ తదితరులు

విడిచిప పెట్టిన జాబితా: ఎంఎస్ ధోనీ (4 కోట్లు), ప్రశాంత్ వీర్ (14.2 కోట్లు), మ్యాట్ హెన్రీ (2 కోట్లు), స్పెన్సర్ జాన్సన్ (1.5 కోట్లు)

మిగిలిన పర్సు: రూ.28.05 కోట్లు | స్లాట్లు: 6 (2 విదేశీ)

2. ముంబై ఇండియన్స్ – బౌలింగ్ ప్రక్షాళన:

రోహిత్, బుమ్రా, సూర్య, తిలక్ వర్మ కోర్‌ను కదిలించలేదు ముంబై. కానీ బౌలింగ్‌లో భారీ కోత విధించింది. ట్రెంట్ బౌల్ట్ (12.50 కోట్లు), దీపక్ చాహర్ (9.25 కోట్లు)ను వదిలి ఏకంగా రూ.32.6 కోట్లతో వేలానికి వెళ్తోంది. అర్ష్‌దీప్ సింగ్ ట్రేడ్ కీలకం.

నిలుపుకున్నవారు: రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, క్వింటన్ డికాక్, రయాన్ రికెల్టన్, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్ తదితరులు

వదిలినవారు: ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ఏఎం గజన్‌ఫర్, కేశవ్ మహరాజ్ తదితరులు

మిగిలిన పర్సు: రూ.32.6 కోట్లు | స్లాట్లు: 9 (2 విదేశీ)

3. కోల్‌కతా నైట్ రైడర్స్ – ఖజానా నిండా డబ్బు:

పఠాన్ (18 కోట్లు), ముస్తాఫిజుర్ (9.2 కోట్లు)ను వదిలి అందర్నీ ఆశ్చర్యపరిచింది కేకేఆర్. రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, కామెరూన్ గ్రీన్, హర్షిత్ రాణాలను నిలుపుకుంది. రూ.41.65 కోట్లతో రెండో అతిపెద్ద పర్సుతో బరిలోకి దిగుతోంది.

మిగిలిన పర్సు: రూ.41.65 కోట్లు | స్లాట్లు: 8 (3 విదేశీ)

4. సన్‌రైజర్స్ హైదరాబాద్ – హెడ్‌కు షాక్:

అత్యంత సంచలన నిర్ణయం హైదరాబాద్‌దే. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ (14 కోట్లు)ను వదిలేసింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ రెడ్డిలను నిలుపుకుంది. నటరాజన్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్‌లను ట్రేడ్ చేసింది. రూ.40.15 కోట్లతో వేలంలో పెద్ద చేపలపై కన్నేసింది.

మిగిలిన పర్సు: రూ.40.15 కోట్లు | స్లాట్లు: 7 (3 విదేశీ)

5. లక్నో సూపర్ జెయింట్స్ – అందరికంటే రిచ్:

ఆవేశ్ ఖాన్ (9.75 కోట్లు), నోర్జే, హసరంగాలను వదిలి అత్యధికంగా రూ.47.45 కోట్ల పర్సుతో వేలానికి వెళ్తున్న ఏకైక జట్టు లక్నో. పూరన్, మార్క్‌రమ్, మార్ష్, సామ్ కరన్, కుల్దీప్ యాదవ్‌లతో బలంగా కనిపిస్తోంది.

మిగిలిన పర్సు: రూ.47.45 కోట్లు | స్లాట్లు: 7 (3 విదేశీ)

6. ఢిల్లీ క్యాపిటల్స్ – స్టార్క్ ఔట్:

మిచెల్ స్టార్క్ (11.75 కోట్లు)ను వదిలి ఢిల్లీ సాహసం చేసింది. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (ట్రేడ్), డేవిడ్ మిల్లర్, స్టబ్స్, పృథ్వీ షాలను నిలుపుకుంది. 4 విదేశీ స్లాట్లతో రూ.39.5 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

మిగిలిన పర్సు: రూ.39.5 కోట్లు | స్లాట్లు: 9 (4 విదేశీ)

7. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్, బెంగళూరు, గుజరాత్:

రాజస్థాన్: హెట్‌మయర్ (11 కోట్లు)ను వదిలింది. జైస్వాల్, పరాగ్, జురెల్, జడేజా, ఆర్చర్, షమీలతో సమతూకంగా ఉంది. పర్సు: రూ.27.05 కోట్లు

8. పంజాబ్:

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో స్టోయినిస్, చాహల్, జాన్సెన్, హార్దిక్ పాండ్యా (ట్రేడ్)లతో బలంగా ఉంది. కేవలం ముగ్గురినే వదిలింది. పర్సు: రూ.18.6 కోట్లు

9. బెంగళూరు:

చాంపియన్ కోర్‌కు ఢోకా లేదు. కోహ్లీ, పాటీదార్, హేజిల్‌వుడ్, సాల్ట్, కృనాల్‌లను నిలుపుకుంది. పర్సు: రూ.14.15 కోట్లు – అతి తక్కువ పర్సుల్లో ఒకటి.

10. గుజరాత్:

శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అత్యంత స్థిరమైన జట్టు. బట్లర్, రషీద్, రబాడ, సిరాజ్, సుందర్‌లను నిలుపుకుంది. కేవలం 3 స్లాట్లు, రూ.8.75 కోట్లతో అత్యంత పొదుపుగా వేలానికి వెళ్తోంది.

ఈసారి వేలంలో లక్నో, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ జట్లదే హవా కానుంది. హెడ్, స్టార్క్, బౌల్ట్, ధోనీ వంటి పేర్లు వేలంలోకి రావడంతో ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ తప్పదు. చెన్నై ధోనీ స్థానాన్ని ఎలా భర్తీ చేస్తుందో, ముంబై పేస్ దళాన్ని ఎలా నిర్మిస్తుందో చూడాలి. అలాగే రిటెన్షన్ తర్వాత ముంబై టీం మోస్ట్ పవర్ ఫుల్ టీంగా కనిపిస్తుండగా.. చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలు వరస్ట్ టీంలుగా మారాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us