IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 19వ సీజన్‌కు రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే?

IPL 2026 opening match venue: ఇప్పటికే టోర్నమెంట్ తేదీలు ఖరారవగా, ఇప్పుడు ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందో కూడా స్పష్టమైంది. తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium) లో జరగనుంది.

IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 19వ సీజన్‌కు రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే?
Ipl

Updated on: Mar 04, 2026 | 8:12 PM

IPL 2026 opening match venue: టీ20 వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంటుండగా, క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) పై పడింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగనుంది.

ఇప్పటికే టోర్నమెంట్ తేదీలు ఖరారవగా, ఇప్పుడు ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందో కూడా స్పష్టమైంది. తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం (M. Chinnaswamy Stadium) లో జరగనుంది.

చిన్ని స్వామి స్టేడియంలో ప్రారంభ మ్యాచ్..

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గత సీజన్ ఛాంపియన్ జట్టు హోమ్ గ్రౌండ్‌లోనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) తమ చరిత్రలో తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

అందుకే, ఈసారి ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్ ఆ జట్టు హోమ్ గ్రౌండ్ అయిన ఎం. చిన్ని స్వామి స్టేడియంలో జరగనుంది. టోర్నమెంట్ ఫైనల్ కూడా అదే వేదికలో జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

గత ఘటన తర్వాత మళ్లీ మ్యాచ్‌లు..

గత సీజన్‌లో ఆర్సీబీ విజయం తర్వాత స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించడంపై తాత్కాలికంగా సందేహాలు ఏర్పడ్డాయి.

అయితే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association) కొత్త అధ్యక్షుడు, మాజీ భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) స్టేడియంలో మళ్లీ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఐపీఎల్ తిరిగి బెంగళూరులో ప్రారంభం కానుంది.

ఆర్సీబీ హోమ్ మ్యాచ్‌లు..

సమాచారం ప్రకారం ఆర్సీబీ తన 7 హోమ్ మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లు చిన్ని స్వామి స్టేడియంలో ఆడనుండగా, 2 మ్యాచ్‌లు షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషల్ క్రికెట్ స్టేడియం (Shaheed Veer Narayan Singh International Cricket Stadium) లో ఆడే అవకాశముంది.

షెడ్యూల్ ఎప్పుడు విడుదల?

ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. అయితే, ఈసారి షెడ్యూల్‌ను రెండు దశల్లో ప్రకటించే అవకాశం ఉంది.

కారణం కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. ముఖ్యంగా తమిళనాడు (Tamil Nadu), వెస్ట్ బెంగాళ్ (West Bengal), అస్సాం (Assam) రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు.

అందుకే ముందుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసి, తరువాత పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us