IPL 2026 : ఐపీఎల్ అంటే ఇంజ్యురీ ప్రీమియర్ లీగ్‌ అనాలేమో..గ్రౌండ్లో ఆడాల్సిన వాళ్లంతా హాస్పిటల్ బెడ్లపై రెస్ట్ తీసుకుంటున్నారుగా

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి అట్టహాసంగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మ్యాచ్‌లు మొదలవ్వక ముందే చాలా జట్లకు బ్యాడ్ న్యూస్ అందుతోంది. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో కెప్టెన్లు, కోచ్‌ల తలలు పట్టుకుంటున్నారు.

IPL 2026 : ఐపీఎల్ అంటే ఇంజ్యురీ ప్రీమియర్ లీగ్‌ అనాలేమో..గ్రౌండ్లో ఆడాల్సిన వాళ్లంతా హాస్పిటల్ బెడ్లపై రెస్ట్ తీసుకుంటున్నారుగా
Ipl Bowlers

Updated on: Mar 18, 2026 | 7:26 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి అట్టహాసంగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మ్యాచ్‌లు మొదలవ్వక ముందే చాలా జట్లకు బ్యాడ్ న్యూస్ అందుతోంది. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో కెప్టెన్లు, కోచ్‌ల తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మెయిన్ బౌలర్లంతా ఈ సీజన్‌కు దూరం కావడం జట్ల విజయవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఎవరెవరు ఈ లిస్టులో ఉన్నారో వివరంగా చూద్దాం.

1. హర్షిత్ రాణా (కేకేఆర్)

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ పేసర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల వేడుకలో అతను కర్రల సహాయంతో నడుస్తూ కనిపించడం అభిమానులను షాక్ కు గురిచేసింది. మోకాలికి ఆపరేషన్ జరగడంతో కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీసే హర్షిత్ లేకపోవడం కేకేఆర్‌కు పెద్ద మైనస్.

2. మతీషా పతిరాణ (కేకేఆర్)

వేలంలో కేకేఆర్ ఏకంగా రూ.18 కోట్లు పోసి పతిరాణను కొనుగోలు చేసింది. కానీ టీ20 వరల్డ్ కప్ సమయంలో అతను కాఫ్ ఇంజ్యురీ బారిన పడ్డాడు. ప్రస్తుతం శ్రీలంకలోనే చికిత్స పొందుతున్న అతను, సీజన్ మొదటి సగానికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖరు వరకు అతను ఫిట్ అయ్యే అవకాశం లేకపోవడంతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ బలహీనపడింది.

3. ప్యాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దీనివల్ల ఆయన ఐపీఎల్ 2026 మొదటి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే కమిన్స్ లేకపోవడంతో, ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ లేదా అభిషేక్ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

4. జోష్ హెజల్‌వుడ్ (ఆర్సీబీ)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ జోష్ హెజల్‌వుడ్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. హ్యామ్‌స్ట్రింగ్, అకిలెస్ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. సీజన్ ఓపెనర్ (ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్‌కు అతను దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్ మధ్య వరకు అతను కోలుకుంటేనే జట్టులో కనిపిస్తాడు.

5. వానిందు హసరంగ (లక్నో సూపర్ జెయింట్స్)

శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ టీ20 వరల్డ్ కప్ లో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన హ్యామ్‌స్ట్రింగ్ గాయం చాలా లోతుగా ఉండటంతో, ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం కష్టమని సమాచారం. లక్నో స్పిన్ అటాక్ లో హసరంగ కీలక పాత్ర పోషిస్తాడని ఆశించిన మేనేజ్‌మెంట్‌కు ఇది పెద్ద షాక్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us