Team India: బార్బడోస్‌లో ఛాంపియన్ టీంకు కష్టాలు.. స్వదేశానికి తిరిగొచ్చేందుకు ఇబ్బందులు..

Indian Team Stuck In Barbados: బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత టీమిండియా ముందు కొత్త సమస్య వచ్చింది. భారత జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ బార్బడోస్‌లో చిక్కుకుపోయి అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు.

Team India: బార్బడోస్‌లో ఛాంపియన్ టీంకు కష్టాలు.. స్వదేశానికి తిరిగొచ్చేందుకు ఇబ్బందులు..
Team India
Follow us

|

Updated on: Jul 01, 2024 | 9:56 AM

Indian Team Stuck In Barbados: బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు ఐసీసీ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత టీమిండియా ముందు కొత్త సమస్య వచ్చింది. భారత జట్టు ఆటగాళ్లు ఇప్పటికీ బార్బడోస్‌లో చిక్కుకుపోయి అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు. తుఫాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూసివేశారు. అన్ని విమానాలు రద్దు చేశారు. ఈ కారణంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ ఇప్పటికీ అక్కడే చిక్కుకున్నారు.

T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ కోసం రిజర్వ్ డే కూడా ఉంది. ఈ కారణంగా, సోమవారం ఇంటికి బయలుదేరాలని ఇరు జట్ల ప్రణాళిక. అయితే, తుఫాను కారణంగా, బార్బడోస్‌లోని విమానాశ్రయం ఇప్పుడు మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడే చిక్కుకున్నారు.

నివేదికల ప్రకారం, తుఫాను వచ్చే 4-5 గంటల్లో చాలా త్వరగా బార్బడోస్‌ను తాకవచ్చని తెలుస్తోంది. ఈ కారణంగా, భారత జట్టులోని ఆటగాళ్లందరూ వారి వారి హోటళ్లలో బస చేస్తున్నారు. ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు.

చార్టర్ ప్లేన్‌లో తిరిగి రానున్న టీమ్ ఇండియా..

వీటన్నింటి మధ్య, బార్బడోస్‌లో చిక్కుకున్న భారత జట్టును తరలించడానికి బీసీసీఐ కార్యదర్శి జే షా చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో, ఆ విమానం ద్వారా దాదాపు 70 మందిని భారతదేశానికి తీసుకురానున్నారు. అయితే, కరీబియన్‌లో 70 మంది ప్రయాణించగలిగే విమానం లేదు. అందుకే బీసీసీఐ దానిని యూఎస్ నుంచి తీసుకొచ్చింది. ముందుగా బార్బడోస్ నుంచి న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు తిరిగి రావాలనేది టీమ్ ఇండియా ప్లాన్. అయితే, ఇది ఇప్పుడు మారవచ్చు అని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ రెండోసారి గెలుచుకుంది. 2007లో టైటిల్‌ను గెలుచుకున్న జట్టు ఇప్పుడు 2024లో టైటిల్‌ను గెలుచుకుంది. చాలా ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..