India vs Zimbabwe Women 1st T20 Highlights: తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం..

IND-W vs ZIM-W 1st T20 Highlights in Telugu: రాయ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయానికి 115 పరుగులు చేయాలి. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో షార్నే మేయర్స్ 33 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.

India vs Zimbabwe Women 1st T20 Highlights: తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం..
India Vs Zimbabwe Women 1st T20 Live

Updated on: Oct 16, 2026 | 10:10 PM

IND-W vs ZIM-W 1st T20 Highlights in Telugu: రాయ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయానికి 115 పరుగులు చేయాలి. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో షార్నే మేయర్స్ 33 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. కెలిస్ న్డ్లోవు 44 బంతుల్లో 42 పరుగులు చేశారు. మరోవైపు భారత బౌలర్లలో నందని శర్మ 2 వికెట్లు తీసుకోగా, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి తలో వికెట్ పడగొట్టారు.

జింబాబ్వే చివరి వరకు వికెట్లు కాపాడుకున్నా, 20 ఓవర్లలో 114 పరుగులకే పరిమితమైంది. ఇప్పుడు భారత బ్యాటర్ల ముందు 5.75 రన్‌రేట్‌తో 115 పరుగుల ఛేజింగ్ ఉంది.

జింబాబ్వే ఈ ఏడాది ఒక్క టీ20 కూడా గెలవలే..

జింబాబ్వే మహిళల జట్టు ఈ ఏడాది 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటన్నిటిలోనూ ఓడిపోయింది. వారి చివరి విజయం 2025 సెప్టెంబర్‌లో నమీబియాపై నమోదైంది. మరోవైపు, భారత్ వరుసగా ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈ జట్టు ఇటీవల ఆసియా కప్ ట్రోఫీతో పాటు ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది.

రాయ్‌పూర్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం..

రాయ్‌పూర్ ఇప్పటివరకు రెండు పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో, భారత్ న్యూజిలాండ్‌పై 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ సమయంలో వాతావరణం స్పష్టంగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీలు, సాయంత్రం 28 డిగ్రీలుగా ఉంటాయని అంచనా.

ఇరు జట్లు:

జింబాబ్వే మహిళలు ప్లేయింగ్ XI: న్యాషా గ్వాన్‌జురా, చిపో ముగేరి-తిరిపానో, కెలిస్ నధ్లోవు, ప్రియమైన బిజా, జోసెఫిన్ న్కోమో(కెప్టెన్), మోడెస్టర్ ముపాచిక్వా(కీపర్), మిచెల్ మవుంగా, ఫ్రాన్సిస్కా చిపరే, ఒలిండర్ చారే, టెండై మయర్స్ మకుషా, షార్నే

భారత మహిళలు ప్లేయింగ్ XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 Oct 2026 10:04 PM (IST)

    INDW vs ZIMW Result: తొలి టీ20లో భారత్ ఘన విజయం..

    రాయ్‌పూర్‌లో జింబాబ్వే మహిళలతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. 115 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి ఛేదించింది.

  • 16 Oct 2026 09:55 PM (IST)

    INDW vs ZIMW: హాఫ్ సెంచరీ ఒక్క పరుగు దూరంలో దీప్తి ఔట్..

    హాఫ్ సెంచరీ ఒక్క పరుగు దూరంలో దీప్తి ఔట్..

  • 16 Oct 2026 09:39 PM (IST)

    దంచి కొడుతోన్న దీప్తి, నిక్కీ ప్రసాద్.. హాఫ్ సెంచరీ భాగస్వామ్యం

    4 వికెట్లు కోల్పోయిన తర్వాత దీప్తి, నిక్కీ ప్రసాద్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు.

  • 16 Oct 2026 09:08 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన భారత్.. షెఫాలీ వర్మ ఔట్..

    4వ వికెట్ కోల్పోయిన భారత్.. షెఫాలీ వర్మ ఔట్..

  • 16 Oct 2026 09:04 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఔట్

    3వ వికెట్ కోల్పోయిన భారత్..

  • 16 Oct 2026 09:01 PM (IST)

    రెండు వికెట్లు కోల్పోయిన భారత్..

    రెండు వికెట్లు కోల్పోయిన భారత్..

  • 16 Oct 2026 08:59 PM (IST)

    INDW vs ZIMW: మంధాన ఔట్.. స్కోర్ 14/1

    మంధాన ఔట్.. స్కోర్ 14/1

  • 16 Oct 2026 08:37 PM (IST)

    INDW vs ZIMW: టీమిండియా టార్గెట్ 115

    రాయ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో జింబాబ్వే మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయానికి 115 పరుగులు చేయాలి.

  • 16 Oct 2026 08:09 PM (IST)

    15 ఓవర్లకు

    15 ఓవర్లకు జింబాబ్వే టీం 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది.

  • 16 Oct 2026 07:49 PM (IST)

    INDW vs ZIMW: శ్రీచరణి ఖాతాలో తొలి వికెట్..

    శ్రీ చరణీ బౌలింగ్‌లో ముపచిక్వా కాటన్ బౌల్డ్ అయ్యింది. దీంతో 10.2ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది.

  • 16 Oct 2026 07:27 PM (IST)

    IND vs ZIM: 5 ఓవర్లకు

    5 ఓవర్లకు జింబాబ్వే టీం 1 వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది.

  • 16 Oct 2026 06:44 PM (IST)

    భారత మహిళలు ప్లేయింగ్ XI:

    షఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్.

  • 16 Oct 2026 06:44 PM (IST)

    జింబాబ్వే మహిళలు ప్లేయింగ్ XI:

    న్యాషా గ్వాన్‌జురా, చిపో ముగేరి-తిరిపానో, కెలిస్ నధ్లోవు, ప్రియమైన బిజా, జోసెఫిన్ న్కోమో(కెప్టెన్), మోడెస్టర్ ముపాచిక్వా(కీపర్), మిచెల్ మవుంగా, ఫ్రాన్సిస్కా చిపరే, ఒలిండర్ చారే, టెండై మయర్స్ మకుషా, షార్నే

  • 16 Oct 2026 06:32 PM (IST)

    INDW vs ZIMW Toss Update: టాస్ గెలిచిన భారత్

    టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

  • 16 Oct 2026 06:15 PM (IST)

    India vs Zimbabwe Women 1st T20: రాయ్‌పూర్ పిచ్ పరిస్థితి

    రాయ్‌పూర్ ఇప్పటివరకు రెండు పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో, భారత్ న్యూజిలాండ్‌పై 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

  • 16 Oct 2026 05:57 PM (IST)

    3వస్థానంలో అనుష్క శర్మ లేదా నికీ ప్రసాద్

    జెమీమా రోడ్రిగ్స్ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నందున ఈ సిరీస్‌కు అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో, మూడో స్థానంలో అనుష్క శర్మ లేదా నికీ ప్రసాద్‌కు అవకాశం లభించవచ్చు.

    ఇటీవల ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుపై ఇద్దరూ బాగా రాణించారు. స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అందుబాటులో లేకపోవడంతో, ప్రేమా రావత్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

  • 16 Oct 2026 05:45 PM (IST)

    బౌలింగ్‌లో శ్రీచరణి తోపు..

    బౌలింగ్‌లో, శ్రీ చరణి 23 మ్యాచ్‌లలో 5.67 ఎకానమీ రేటుతో 47 వికెట్లు పడగొట్టింది. ఈ ఏడాది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆమె అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.

  • 16 Oct 2026 05:36 PM (IST)

    India vs Zimbabwe Women 1st T20 Live: షెఫాలీ వర్మ దూకుడు..

    షెఫాలీ వర్మ ఈ ఏడాది 24 టీ20 మ్యాచ్‌లలో 162.83 స్ట్రైక్ రేట్‌తో 863 పరుగులు సాధించింది. ఆమె అత్యుత్తమ స్కోరు నాటౌట్ 100. ఆమె వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించనుంది.

  • 16 Oct 2026 05:15 PM (IST)

    కెప్టెన్‌గా తొలి సిరీస్..

    ఇది స్మృతి మంధానా పూర్తి స్థాయి భారత మహిళల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్. భారత్–జింబాబ్వే మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక మహిళల T20I సిరీస్.

  • 16 Oct 2026 04:52 PM (IST)

    India vs Zimbabwe Women 1st T20 Live: టీమిండియా దూకుడు..

    భారత్ వరుసగా ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈ జట్టు ఇటీవల ఆసియా కప్ ట్రోఫీతో పాటు ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది.

  • 16 Oct 2026 04:28 PM (IST)

    INDW vs ZIMW: ఒక్క మ్యాచ్ కూడా గెలవలే..

    జింబాబ్వే మహిళల జట్టు ఈ ఏడాది 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటన్నిటిలోనూ ఓడిపోయింది. వారి చివరి విజయం 2025 సెప్టెంబర్‌లో నమీబియాపై నమోదైంది.

  • 16 Oct 2026 04:15 PM (IST)

    IND vs ZIM: తొలిసారి జింబాబ్వేతో పోరు..

    మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, జింబాబ్వే జట్లు నేడు తొలిసారిగా ఢీ కొట్టబోతున్నాయి. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు రాయ్‌పూర్‌లో జరగనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us