ఆదివారం హరారే మైదానంలో జరిగిన 5వ టీ20లో కూడా టీమిండియా జింబాబ్వేపై విజయం సాధించింది. అలాగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. 5వ టీ20లో జింబాబ్వే టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆదేశించింది. పవర్‌ప్లే వరకు కెప్టెన్ సికందర్ రజా నిర్ణయం సరైనదని నిరూపితమైంది. పవర్‌ప్లేలో భారత్ కెప్టెన్ శుభ్‌మన్, ఓపెనర్ యశస్వి, అభిషేక్ శర్మల వికెట్లను కోల్పోయింది. అప్పటికి స్కోరు బోర్డ్‌లో 46 పరుగులు మాత్రమే ఉన్నాయి.
దీని తర్వాత సంజూ శాంసన్ అర్ధశతకం సాధించి, రియాన్ పరాగ్‌తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శివమ్ దూబే డెత్ ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లు బాది జట్టు స్కోరును 167 పరుగులకు చేర్చాడు.
A 42-run victory in the 5th & Final T20I 🙌
With that win, #TeamIndia complete a 4⃣-1⃣ series win in Zimbabwe 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#ZIMvIND pic.twitter.com/oJpasyhcTJ
— BCCI (@BCCI) July 14, 2024
168 పరుగుల ఛేదనలో జింబాబ్వేను ముఖేష్ కుమార్, శివమ్ దూబే ఇబ్బంది పెట్టారు. ముఖేష్ పవర్‌ప్లేలో 2 వికెట్లు, 19వ ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్లలో శివమ్ దూబే తన అద్భుతమైన బౌలింగ్‌తో 2 వికెట్లు కూడా పడగొట్టాడు. జింబాబ్వే జట్టు కేవలం 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్.
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..