Sanju Samson: సంజూ నువ్వు సూపరహే! టీమిండియా ఆటగాడిపై ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్‌.. ఎందుకో తెలుసా?

|

Jul 23, 2022 | 1:27 PM

India vs West Indies 1st ODI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మూడు పరుగులతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు..

Sanju Samson: సంజూ నువ్వు సూపరహే! టీమిండియా ఆటగాడిపై ప్రశంసలు కురిపిస్తోన్న ఫ్యాన్స్‌.. ఎందుకో తెలుసా?
India Vs West Indies
Follow us on

India vs West Indies 1st ODI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మూడు పరుగులతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 308 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు కేవలం 305 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో తుది బంతి వరకూ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. కాగా ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్‌ (Sanju Samson) వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈక్రమంలో చివరి ఓవర్‌లో అతను చేసిన ఓ డైవ్‌ మ్యాచ్‌ను టీమిండియా వైపు మొగ్గేలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అద్భుతంగా డైవ్‌ చేసి..

కాగా విండీస్‌ విజయం సాధించాలంటే చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో కెప్టెన్‌ శిఖర్ ధావన్ బంతిని సిరాజ్‌కి అందించాడు. అప్పటికే షెపర్డ్‌, అకిల్‌ హొస్సేన్‌ దూకుడుమీద ఉన్నారు. దీంతో చివరి ఓవర్ తొలి నాలుగు బంతుల్లో ఏడు పరుగులు వచ్చాయి. అయితే ఇదే సమయంలో సిరాజ్‌ వికెట్లకు దూరంగా లెగ్‌సైడ్‌ బంతిని వైడ్‌గా విసిరాడు. క్షణాల్లో ఒక్క సారిగా బంతి బౌండరీ దాటి పోతుందేమోనని అందరూ భావించారు. అయితే శాంసన్ అద్భుత డైవ్‌తో బంతిని ఆపాడు. తద్వారా నాలుగు పరుగులు ఆదా అయ్యాయి. ఇకవేళ ఈ బంతి బౌండరీకి వెళ్లి ఉంటే వెస్టిండీస్ చివరి రెండు బంతుల్లో 3 పరుగులు చేసి మ్యాచ్ గెలిచి ఉండేది. ఈనేపథ్యంలో సంజూ శాంసన్‌ తీసుకున్న ఈ క్యాచ్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో, వీడియో కూడా వైరల్ అవుతుంది. శాంసన్ డైవ్ టీమ్ ఇండియాను గెలిపించిందని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా వికెట్‌ కీపింగ్‌లో మెరిసిన శామ్సన్‌ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. కేవలం12 పరుగులు చేసి ఔటయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..