IND vs WI: వచ్చేశాడ్రోయ్ విండీస్‌కు అసలైన మొగుడు.. 4 ఏళ్ల తర్వాత కోహ్లీ దోస్త్ రీఎంట్రీ..!

India vs West Indies 5th T20I: వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు ముందు టీమ్‌ఇండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. నాలుగో టీ20లో గాయపడిన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో శనివారం జరిగే ఐదో టీ20లో భువీ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

IND vs WI: వచ్చేశాడ్రోయ్ విండీస్‌కు అసలైన మొగుడు.. 4 ఏళ్ల తర్వాత కోహ్లీ దోస్త్ రీఎంట్రీ..!
Bhuvneshwar Kumar

Updated on: Oct 16, 2026 | 4:46 PM

India vs West Indies 5th T20I: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే 4 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టీ20కి ముందు భారత జట్టులో కీలక మార్పు జరిగింది. నాలుగో టీ20లో గాయపడిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది.

అర్ష్‌దీప్ సింగ్ నాలుగో టీ20లో గాయం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో చివరి మ్యాచ్ కోసం అతడి స్థానాన్ని భువనేశ్వర్ కుమార్‌తో భర్తీ చేయాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ఇప్పటికే న్యూజిలాండ్ పర్యటన కోసం ప్రకటించిన టీ20 జట్టులో భువీకి చోటు దక్కిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఇప్పుడు అతడిని కొద్దిగా ముందుగానే టీమ్‌తో కలవనుంది. వెస్టిండీస్‌తో చివరి టీ20లో ఆడే అవకాశం లభిస్తే, న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభించే అవకాశం ఉంటుంది.

అనుభవజ్ఞుడైన భువీకి కొత్త బంతితో స్వింగ్ చేయగల సామర్థ్యంతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసిన అనుభవం ఉంది. చివరి టీ20లో భారత బౌలింగ్ విభాగంలో అతడి పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. కాగా, 2022లో భారత జట్టు తరపున టీ20 మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్.. దాదాపు 4 ఏళ్ల తర్వాత టీమిండియా తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.

భువనేశ్వర్ కుమార్ టీ20 గణాంకాలు..

మ్యాచ్‌లు 87
ఇన్నింగ్స్‌లు 86
వికెట్స్ 90
ఎకానమీ 6.96
బెస్ట్ బౌలింగ్ 5/4

ఇక వెస్టిండీస్‌తో సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అర్ష్‌దీప్ స్థానంలో భువనేశ్వర్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? లేక మరో బౌలింగ్ కాంబినేషన్‌తో భారత్ బరిలోకి దిగుతుందా? అన్నది మ్యాచ్‌కు ముందు స్పష్టత రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us