IND vs NZ: ఆకిబ్ నబీ విధ్వంసం.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత చెత్త రికార్డులో కివీస్..!

India vs New Zealand ODI: భారత్‌తో వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆరంభం ఎంత కష్టంగా సాగిందో ఓ ఆసక్తికర గణాంకం వెల్లడిస్తోంది. తొలి ఐదు ఓవర్లలో కేవలం ఏడు పరుగులే చేయగలిగిన కివీస్ జట్టు, గతంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నది 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లోనే. ఈ స్టాట్ ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

IND vs NZ: ఆకిబ్ నబీ విధ్వంసం.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత చెత్త రికార్డులో కివీస్..!
Ind Vs Nz Auqib Nabi

Updated on: Nov 07, 2026 | 9:20 AM

India vs New Zealand ODI: భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) వన్డే క్రికెట్ పోరులో ఓ ఆసక్తికరమైన గణాంకం వెలుగులోకి వచ్చింది. కివీస్ జట్టు భారత బౌలర్లను ఎదుర్కొంటూ తొలి ఐదు ఓవర్లలో పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. తాజాగా వెల్లింగ్టన్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లో 5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 7 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి ప్రదర్శన మళ్లీ గుర్తుకొచ్చింది. అప్పట్లో కూడా న్యూజిలాండ్ తొలి ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోయి కేవలం ఏడు పరుగులే చేసింది. ఇప్పుడు అదే తరహా గణాంకం మరోసారి తెరపైకి రావడంతో క్రికెట్ అభిమానులు ఈ విషయంపై ఆసక్తి చూపిస్తున్నారు.

2019 జూలై 9న ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రపంచకప్ సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుకు భారత పేసర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అద్భుతమైన బంతితో మార్టిన్ గప్టిల్ (Martin Guptill)ను పెవిలియన్‌కు పంపించాడు. గప్టిల్ 14 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

మరోవైపు భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు సాధించలేకపోయారు. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 7/1గా నమోదైంది. హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు సృష్టించిన ఒత్తిడి ప్రత్యర్థి బ్యాటింగ్‌పై స్పష్టంగా కనిపించింది.

ఈ గణాంకం మరోసారి తెరపైకి రావడం భారత బౌలింగ్ సామర్థ్యాన్ని గుర్తు చేస్తోంది. ముఖ్యంగా వన్డేల్లో తొలి పవర్‌ప్లే ఎంత కీలకమో ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులను నియంత్రిస్తే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. మొత్తానికి, న్యూజిలాండ్ తొలి ఐదు ఓవర్లలో ఏడు పరుగులకే పరిమితం కావడం సాధారణ విషయం కాదు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో నమోదైన ఈ గణాంకం మరోసారి చర్చకు రావడం క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమైన అంశంగా మారింది.

ప్రస్తుతం స్కోర్..

టాస్ ఓడి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోన్న న్యూజిలాండ్ టీం 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. అఖిబ్ నబీ, మొదట టిమ్ సీఫెర్ట్‌ను, ఆ తర్వాత విల్ యంగ్‌ను ఔట్ చేశాడు. అన్షుల్ ఒక వికెట్ పడగొట్టాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us