IND vs NZ: సెంచరీతో లేడీ కోహ్లీ విధ్వంసం.. కట్‌చేస్తే.. మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన టీమిండియా క్వీన్

|

Oct 29, 2024 | 9:37 PM

Smriti Mandhana: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన వన్డేల్లో 8వ సెంచరీ సాధించింది. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

IND vs NZ: సెంచరీతో లేడీ కోహ్లీ విధ్వంసం.. కట్‌చేస్తే.. మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన టీమిండియా క్వీన్
Smriti Mandhana Century
Follow us on

Smriti Mandhana Century: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన 8వ వన్డే సెంచరీతో మెరిసింది. దీంతో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను స్మృతి అధిగమించింది. టీమ్ ఇండియా తరపున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. గత కొన్ని రోజులుగా పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్న స్మృతి ఆలస్యంగా తన పాత రిథమ్‌కి వచ్చింది. స్మృతి మందాన వన్డే ప్రపంచకప్‌ ముందు ఫామ్‌లోకి వచ్చింది. ఇది టీమిండియాకు శుభవార్త.

మంధాన తొలి మహిళా క్రికెటర్‌..

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సెంచరీతో మరో రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 సెంచరీలు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన నిలిచింది. మంధాన చేసిన ఈ సెంచరీలో మరో విశేషం ఏమిటంటే.. మంధాన చేసిన ఈ సెంచరీ ఇన్నింగ్స్ మూడో వన్డేలో టీమిండియాను విజయతీరాలకు చేర్చడమే కాకుండా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంలో దోహదపడింది. 73 బంతుల్లో 4 బౌండరీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మంధాన.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత 121 బంతుల్లో 6 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసింది.

సెంచరీ భాగస్వామ్యం..

తన సెంచరీ ఇన్నింగ్స్‌తో పాటు, మంధాన కూడా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు 116 బంతుల్లో 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంతో టీమిండియా ఈ మ్యాచ్‌లో సులువుగా విజయం సాధించింది.

మ్యాచ్ ఇలా సాగింది..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లు ఆడకుండానే 49.3 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్ జట్టు తరుపున 86 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడగా, జార్జియా ప్లిమ్మర్ కూడా 39 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున బౌలింగ్‌లో రాణించిన దీప్తి అత్యధికంగా 3 వికెట్లు తీయగా, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు.

ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. షెఫాలీ వర్మ తొందరగానే ఔటైంది. ఆ తర్వాత మంధాన 104 బంతుల్లో యాస్టికా భాటియాతో కలిసి 76 పరుగులు జోడించింది. భాటియా ఔటైన తర్వాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌కు అనుకూలంగా మార్చుకుంది. హర్మన్‌ప్రీత్ 54 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చి నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..