IND vs NZ Final : వరుణ్ నంబర్ 1 బౌలర్.. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్

IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు ముందు అహ్మదాబాద్‌లో సందడి నెలకొంది. భారత్, న్యూజిలాండ్ కెప్టెన్లు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానాలిస్తూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని చాటారు.

IND vs NZ Final : వరుణ్ నంబర్ 1 బౌలర్.. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
Ind Vs Nz Final

Updated on: Mar 07, 2026 | 9:56 PM

IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు ముందు అహ్మదాబాద్‌లో సందడి నెలకొంది. భారత్, న్యూజిలాండ్ కెప్టెన్లు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో సమాధానాలిస్తూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని చాటారు. వరుణ్ చక్రవర్తి ఫామ్ గురించి ఆందోళన చెందడం లేదని, అతను మ్యాచ్ విన్నర్ అని సూర్య స్పష్టం చేశారు. మరోవైపు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని, అవసరమైతే భారతీయుల మనసులు ముక్కలు చేసి అయినా ట్రోఫీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కెప్టెన్‌గా ఫైనల్‌కు నడిపించడం చాలా గర్వంగా ఉందని సూర్య అన్నారు. ఒత్తిడి గురించి అడిగిన ప్రశ్నకు.. ఒత్తిడి లేకపోతే మజా ఉండదు అని సమాధానమిచ్చారు. ప్రాక్టీస్ సెషన్లలోనే కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల మైదానంలో ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. పిచ్ గురించి మాట్లాడుతూ.. ఇది ఫ్రెష్ వికెట్ లా కనిపిస్తోందన్నారు. మొదట బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్ చేసినా తాము దేనికైనా రెడీగా ఉన్నామని భరోసా ఇచ్చారు. 250 పరుగుల టార్గెట్ తో తాము బరిలోకి దిగడం లేదని, పిచ్ డిమాండ్ బట్టి ఎంత స్కోరైనా సాధించి దాన్ని డిఫెండ్ చేస్తామని పేర్కొన్నారు.

వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్‌లో పరుగులు సమర్పించుకున్నప్పటికీ, సూర్య అతనికి అండగా నిలిచారు. “వరుణ్ ప్రపంచ నంబర్ వన్ బౌలర్. అందరికీ అన్ని రోజులు బాగుండవు. మాది ఒక టీమ్. ఒకరు విఫలమైతే మరొకరు ఆ లోటును భర్తీ చేస్తారు. వరుణ్ క్లాస్ బౌలర్, అతను ఫైనల్‌లో ఖచ్చితంగా రాణిస్తాడు” అని సూర్య చెప్పుకొచ్చారు. తుది జట్టులో మార్పుల గురించి అడిగితే.. “రేపు మైదానంలోనే చూడండి, అన్నీ ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా?” అంటూ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా తన వ్యూహాలను పంచుకున్నారు. “మేము ఫేవరెట్స్ కాకపోవచ్చు, కానీ మా పని మేము సరిగ్గా చేస్తే ట్రోఫీ మాదే. ప్యాట్ కమిన్స్ లాగా స్టేడియాన్ని సైలెంటుగా ఉంచడమే మా లక్ష్యం” అని అన్నారు. వరుణ్ చక్రవర్తి ఫామ్ గురించి శాంట్నర్ స్పందిస్తూ.. ఏ బౌలర్ కైనా ఒక బ్యాడ్ డే ఉంటుందని, అయితే అతనిపై ఒత్తిడి పెంచి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రపంచకప్ ఫైనల్ ఒత్తిడి భారత్‌పైనే ఎక్కువగా ఉంటుందని, దాన్ని తాము అనుకూలంగా మలుచుకుంటామని శాంట్నర్ ధీమా వ్యక్తం చేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us