3వ వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!

IND vs NZ 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య హమిల్టన్‌లో జరిగే మూడో వన్డే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా, న్యూజిలాండ్ విజయం సాధించి సిరీస్‌ను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో పాటు వర్షం ముప్పు కూడా ఈ మ్యాచ్‌కు సవాలుగా నిలవనుంది.

3వ వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
Ind Vs Nz 3rd Odi Playing Xi

Updated on: Nov 09, 2026 | 8:11 AM

IND vs NZ 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో అత్యంత కీలకమైన 3వ వన్డే రేపు హమిల్టన్‌లోని సెడన్ పార్క్ వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించి 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని బలంగా కోరుకుంటోంది. మరోవైపు, సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. దీంతో ఈ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

పిచ్ రిపోర్ట్, మైదానం పరిస్థితులు..

సెడన్ పార్క్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా ప్రసిద్ధి చెందింది. ఈ మైదానంలో బౌన్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాటర్లు బంతిని సులభంగా టైమింగ్ చేయగలరు. అలాగే, సైడ్ బౌండరీలు చాలా చిన్నవిగా ఉండటం వల్ల సిక్సర్లు, ఫోర్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఉదయం పూట ఆకాశం మేఘావృతమై ఉంటే, తొలి ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్ మూమెంట్ లభిస్తుంది. కానీ మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారి బ్యాటింగ్‌కు పూర్తిగా సహకరిస్తుంది. మొత్తంగా చూసుకుంటే, ఇక్కడ జరిగిన గత 10 వన్డేలలో ఛేజింగ్ చేసిన జట్లే 60% మ్యాచ్‌లలో విజయం సాధించాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

టీమ్ ఇండియా వ్యూహాలు, ప్లేయింగ్ ఎలెవన్..

ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. గత రెండు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఉండనుంది. అయితే, ఈసారి టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ గాడిన పడాల్సిన అవసరం ఉంది. మంచి ఆరంభం ఇస్తే, ఖచ్చితంగా గెలుపుతో పాటు సిరీస్‌ను చేజిక్కించుకునే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసి వచ్చే అంశం. బౌలింగ్‌లో టీమ్ ఇండియా బాగా వర్కవుట్ అవుతోంది కానీ, బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైతే మూడో విజయం మనదే.
ప్రస్తుత అంచనా ప్రకారం టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండొచ్చు: శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెల్ రాహుల్, అక్షర్ పటేల్, నమందీర్, అన్సుల్ కంబోజ్, గుర్నూర్ బార్, అక్యూబ్ నబీ, అర్షదీప్ సింగ్. మహమ్మద్ సిరాజ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఒకవేళ ఈ మూడో వన్డే గెలిస్తే, చివరి రెండు మ్యాచ్‌లలో అతనికి అవకాశం లభించవచ్చు.

వాతావరణ నివేదిక, వర్షం ముప్పు..

ఈ కీలక మ్యాచ్‌కు ముందు వర్షం ముప్పు పొంచి ఉంది. హమిల్టన్‌లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో రెండో వన్డే తరహాలోనే ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లు కుదించడం లేదా డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం ఫలితం తేలే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అడపాదడపా వర్షం ఆటను అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి మ్యాచ్ జరిగితే, అభిమానులకు మంచి వినోదం లభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us