అతని కోసం ప్లాన్ చేశాం.. ఆ ఉచ్చులో మేమే పడిపోయాం.. ఆ ఒక్కటే మా కొంపముంచిందిగా..!

Santner on IND vs NZ 2nd T20 Defeat: రెండో టీ20లో టీమిండియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిపై కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించారు. మ్యాచ్ గెలిచేంత దగ్గరకు వచ్చి ఓడిపోవడం నిరాశ కలిగించిందన్నారు. తిలక్ వర్మ, నితీష్ అద్భుత ప్రదర్శన చేశారని, తమ వ్యూహం భారత్‌కే మేలు చేసిందని శాంట్నర్ పేర్కొన్నారు.

అతని కోసం ప్లాన్ చేశాం.. ఆ ఉచ్చులో మేమే పడిపోయాం.. ఆ ఒక్కటే మా కొంపముంచిందిగా..!
Santner On Ind Vs Nz 2nd T20 Defeat

Updated on: Oct 25, 2026 | 9:44 PM

Santner on IND vs NZ 2nd T20 Defeat: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ పరాజయం పాలైంది. ఈ ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తన స్పందనను తెలియజేశారు. టీమిండియా యువ ఆటగాళ్లైన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిల అద్భుత ప్రదర్శన తమకు ఓటమిని మిగిల్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సాధారణంగా న్యూజిలాండ్‌లో చిన్న గ్రౌండ్‌లు ఉంటాయి. అయితే, క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ మైదానం మిగతా స్టేడియాల కంటే పెద్దది. ఇలాంటి పెద్ద గ్రౌండ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియాను ఓడించాలని న్యూజిలాండ్ పన్నాగాం పన్నింది. కానీ, న్యూజిలాండ్ పన్నిన వ్యూహం వారికి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ అంచనా వేసి ఒకే వేదికలో రెండు మ్యాచులను ఓడిపోవాల్సి వచ్చింది.

రెండో టీ20 ఓటమి అనంతరం శాంట్నర్ మాట్లాడుతూ, తొలి టీ20తో పోలిస్తే రెండో టీ20లో తాము చాలా మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నారు. “మ్యాచ్ గెలిచామన్నంత దగ్గరకు వచ్చి ఓడిపోయాం. ఆఖరి వరకు వచ్చి మ్యాచ్ చేజారిపోవడం చాలా నిరాశ కలిగించింది” అని ఆయన అన్నారు. పటిష్టమైన జట్టుతో ఆడేటప్పుడు ఇలాంటి ఉత్కంఠ పోరు సహజమేనని తెలిపారు. టీమిండియా తరపున తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. ఈ ఇద్దరిలో ఒక్క వికెట్‌నైనా తీసి ఉంటే అక్కడే మ్యాచ్ ముగిసి ఉండేదని, కానీ ఇద్దరూ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి తమ జట్టును గెలిపించుకున్నారని శాంట్నర్ వివరించారు. చివర్లో తమ బౌలర్లు చేసిన తప్పులను టీమిండియా బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకున్నారని ఆయన అంగీకరించారు. అంతేకాదు, తొలి రెండు మ్యాచ్‌లు ఒకే వేదికపై జరగడం తమకు అనుకూలంగా మారుతుందని భావించినా, అది పూర్తిగా టీమిండియాకే మేలు జరిగిందని మిచెల్ శాంట్నర్ చెప్పుకొచ్చారు.

క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టాస్ ఓడిన కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డ టీమిండియా ఆఖర్లో అద్భుతం చేసి మరొక్క బంతి మిగిలి ఉండగానే ఆరు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తిలక్ వర్మ మెరుపు అర్ధ శతకంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి 200 స్ట్రైక్ రేట్‌తో కేవలం 13 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ సారథి శాంట్నర్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ జట్టును గెలిపించుకోలేకపోయాననే నిరాశను ఆయన వ్యక్తం చేశారు. ఇది వారికి వరుసగా రెండో చేదు అనుభవం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us