Rohit vs Duckett: పంత్ బ్యాటింగ్ చూస్తే, నీ తిక్క కుదిరేది.. డకెట్‌కు ఇచ్చిపడేసిన రోహిత్..

|

Mar 06, 2024 | 10:23 PM

India vs England 5th Test: మూడో టెస్టు ముగిసిన అనంతరం డకెట్ మాట్లాడుతూ .. 'ఆయన ఆట మా బజ్ బాల్ క్రికెట్ నుంచి ప్రేరణ పొందింది. అన్ని జట్లు మా శైలిని అనుసరిస్తున్నాయి. అంటూ డకెట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి కౌంటర్‌గా రోహిత్ శర్మ, రిషభ్ పంత్‌ను ఉదాహరణగా తీసుకుని ఇచ్చిపడేశాడు.

Rohit vs Duckett: పంత్ బ్యాటింగ్ చూస్తే, నీ తిక్క కుదిరేది.. డకెట్‌కు ఇచ్చిపడేసిన రోహిత్..
Rohit Sharma IND vs ENG
Follow us on

Rohit Sharma vs Ben Duckett: ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టుకు సర్వం సిద్ధమైంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి. ఈ మ్యాచ్ లో ఉత్కంఠభరితమైన ఆటను ఆశించవచ్చు. మూడో టెస్టు అనంతరం ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్, యశస్వి జైస్వాల్లపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. మూడో టెస్టు ముగిసిన అనంతరం డకెట్ మాట్లాడుతూ ‘విజయవంతమైన ఆట మా బజ్ బాల్ క్రికెట్ నుంచి ప్రేరణ పొందింది. అన్ని జట్లు మా శైలిని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు రోహిత్‌ను విమర్శిస్తూ రిషబ్ పంత్, డక్కీలను ఉదాహరణగా తీసుకున్నాడు.

ఇంగ్లాండ్ నుంచి నేర్చుకున్న పాఠాలు..

వాస్తవానికి మూడో టెస్టు తర్వాత యశస్వి జైస్వాల్ ఆటతీరును ప్రశంసించిన డకెట్ ఈ తరహా దూకుడు బ్యాటింగ్ శైలి ఇంగ్లండ్ నుంచి నేర్చుకున్న పాఠమని అన్నాడు. ఇంగ్లాండ్ దూకుడుగా క్రికెట్ ఆడటాన్ని చూసిన ఇతర జట్లు కూడా దీనిని అవలంబిస్తున్నాయి. ఇతర ఆటగాళ్లు, ఇతర జట్లు కూడా దూకుడుగా క్రికెట్ ఆడటం చాలా ఉత్సాహాన్నిస్తుంది. సక్సెస్ ఫుల్ ఫ్యూచర్ ఉన్న సూపర్ స్టార్ లా కనిపిస్తున్నాడు. కానీ, ప్రస్తుతం అతను మంచి ఫామ్‌లో ఉండటం మా దురదృష్టకరం’ అని డకెట్ పేర్కొన్నాడు.

పంత్ ఆడటం చూడలేదనుకుంటా..

ఐదో టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా డకెట్‌కు ధీటైన సమాధానం ఇచ్చాడు. తన దూకుడు బ్యాటింగ్ తో టెస్టు క్రికెట్ లో ఎన్నో మ్యాచ్ లు గెలిచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిషబ్ పంత్ ను రోహిత్ గుర్తు చేశాడు. బుధవారం విలేకరుల సమావేశంలో స్ట్రెయిట్ సిక్సర్ కొట్టిన రోహిత్ ఇంగ్లండ్ జట్టుకు, ముఖ్యంగా బెన్ డకెట్ కు ధీటైన సమాధానం ఇచ్చాడు. ‘మా జట్టులో రిషబ్ పంత్ అనే ఆటగాడు ఉన్నాడు. బహుశా బెన్ డకెట్ పంత్ ఆటను చూడలేదని నేను అనుకుంటున్నాను అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..