AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సిరాజ్ దెబ్బకు బెన్ స్టోక్స్‌ బాక్స్ బద్దలైందిగా.. పాపం ఎలా ఇబ్బంది పడ్డాడో చూడండి

Ben Stokes Video: మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కానీ, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతనికి తగలరాని చోట బంతి తగిలింది. ఈ సంఘటన స్టోక్స్‌కు కొద్దిసేపు ఇబ్బంది కలిగించినా, అతను ధైర్యంగా నిలబడి బ్యాటింగ్ కొనసాగించడం ప్రశంసనీయం. ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Video: సిరాజ్ దెబ్బకు బెన్ స్టోక్స్‌ బాక్స్ బద్దలైందిగా.. పాపం ఎలా ఇబ్బంది పడ్డాడో చూడండి
Ben Stokes Video
Venkata Chari
|

Updated on: Jul 25, 2025 | 8:17 PM

Share

క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో, 4వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతి తగలరాని చోట బలంగా తాకడంతో స్టోక్స్ నొప్పితో విలవిల్లాడిన దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఈ ఘటన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అనుకున్నంత ఎత్తుకు లేవకుండా, లో బౌన్స్‌గా దూసుకొచ్చి బెన్ స్టోక్స్ ప్రైవేట్ పార్ట్‌కు బలంగా తగిలింది. సుమారు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి ధాటికి స్టోక్స్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు.

ఇవి కూడా చదవండి

నొప్పిని భరించలేక స్టోక్స్ నేలపై పడుకొని విలవిల్లాడు. ఈ దృశ్యం చూసి మైదానంలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా వెంటనే స్టోక్స్ వద్దకు వెళ్లి పరామర్శించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా వెంటనే స్టోక్స్ దగ్గరికి వచ్చి ఏదైనా అయిందా అని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకున్న స్టోక్స్, కొంతసేపటి తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు స్టోక్స్ పడ్డ బాధకు సానుభూతి వ్యక్తం చేస్తూ, “పాపం స్టోక్స్”, “బాక్స్ బద్దలైంది” అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే, సిరాజ్ వేగం, బౌలింగ్ కచ్చితత్వం మరోసారి ఈ సంఘటనతో నిరూపితమయ్యాయి.

అద్భుతమైన బెన్ స్టోక్స్..

బెన్ స్టోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. దీని ఆధారంగా ఇంగ్లాండ్ భారత్‌ను 358 పరుగులకే పరిమితం చేసింది. టెస్ట్‌లలో 5 వికెట్లు పడగొట్టిన ఘనతను స్టోక్స్ ఐదవసారి సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఐదుసార్లు 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 10 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే నాల్గవ ఆల్ రౌండర్ అతను. 8 సంవత్సరాల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఘనతను సాధించాడు. అతను చివరిసారిగా 2017 సంవత్సరంలో ఈ ఘనతను సాధించాడు.

జో రూట్ సెంచరీ..

బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జో రూట్ మాంచెస్టర్ టెస్ట్‌లో సెంచరీ సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్ట్‌లలో తన 38వ సెంచరీని సాధించాడు. ఈ సిరీస్‌లో రూట్ తన రెండవ సెంచరీని సాధించాడు. ఒక దేశంలో భారతదేశంపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా రూట్ సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో భారతదేశంపై అతను 1900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
కుండీల్లోనే తియ్యని క్యారెట్లు! సింపుల్‌ స్టెప్స్‌తో సాగుచేయండి!
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
ముంబైతో ఢిల్లీ ఢీ..రాజస్థాన్‌తో గుజరాత్.. గెలుపెవరిదో ?
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
రాత్రికి రాత్రే అదృష్టం మారే రాశులివే..అబ్బా బ్బా ఏం లక్కురా బాబు
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
కాస్త కారంగా.. సూపర్ టేస్టీగా క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
పైన బ్రాండ్ సెన్సోడైన్.. ఓపెన్ చేసి చూస్తే షాక్!
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
ఇరాన్‌పై అమెరికా భీకరదాడి.. ధ్వంసమైన ఎత్తైన వంతెన
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!