IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

India vs England 2nd odi live streaming: మొత్తం మీద, తొలి వన్డేలో సమిష్టి కృషితో సత్తా చాటిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని యావత్ భారత క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. అటు తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ ఎలా బదులిస్తుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

IND vs ENG 2nd ODI: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మారిన రెండో వన్డే టైమింగ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?
Ind Vs Eng 2nd Odi Timing

Updated on: Jul 15, 2026 | 12:02 PM

India vs England 2nd ODI Live Streaming: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత వన్డేల్లో సత్తా చాటుతున్న టీమిండియా, ఇప్పుడు ఇంగ్లాండ్‌తో రెండో సమరానికి సమరశంఖం పూరించింది. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో జోరుమీదున్న భారత జట్టు, రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అసలు ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ చూడాలి? తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

తొలి వన్డేలో అదరగొట్టిన భారత వీరులు..

ఇంగ్లాండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0 తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న భారత క్రికెట్ జట్టు, వన్డే సిరీస్‌లో మాత్రం అద్భుతమైన పునరాగమనం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 258 పరుగుల సవాలును విసరగా, భారత బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ఓపెనర్ రోహిత్ శర్మ (11), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (5) లాంటి దిగ్గజాలు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే యువ కెరటం శుభ్‌మన్ గిల్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ (57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అజేయ భాగస్వామ్యంతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

ఇది కూడా చదవండి: ఇంగ్లాండ్‌లో ఇరగదీసినా.. ఆ టీమిండియా స్టార్ ప్లేయర్‌కు 2027 వరల్డ్ కప్‌లో నో ప్లేస్.. ఎందుకంటే..?

ఇవి కూడా చదవండి

సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్..

ఇప్పుడు ఇరు జట్ల దృష్టి రెండో వన్డేపై పడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2-0 తేడాతో సిరీస్‌ను అజేయంగా కైవసం చేసుకోవాలని టీమిండియా ఉరకలేస్తుండగా, ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ పోరాడనుంది. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

రెండో వన్డే వేదిక, పిచ్ రిపోర్ట్..

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేకు కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు మంచి సహకారం లభిస్తుంది. అయితే, ఇక్కడ లక్ష్యాన్ని ఛేదించే జట్లదే పైచేయిగా ఉంటుంది కాబట్టి, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం మెండుగా ఉంది.

ఇది కూడా చదవండి: Kohli vs Gambhir: టీమిండియాలో ముదిరిన విభేదాలు.. కోచ్ గంభీర్, కోహ్లీ మధ్య మాటలు బంద్..?

మ్యాచ్ తేదీ, సమయం..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండో వన్డే మ్యాచ్ గురువారం, జూలై 16న జరగనుంది. సాధారణంగా జరిగే మ్యాచ్ సమయాల కంటే భిన్నంగా ఈ పోరు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి: ఆ ముగ్గురు దద్దమ్మలు ఇక ఇంటికే.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన పులి.. కోహ్లీ దోస్త్ గ్రాండ్ ఎంట్రీ?

లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?

ఈ మ్యాచ్‌ను టీవీలో చూడాలనుకునే అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో వీక్షించవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ (JioHotstar) యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us