IND vs AFG 2nd T20I: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. మొహాలీ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు టీమ్ ఇండియా చూపు సిరీస్ గెలవడంపైనే ఉంది. ఆదివారం ఇండోర్‌లో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా సిరీస్ గెలవాలని కెప్టెన్ రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ టెన్షన్ పడ్డాడు. ఈ మ్యాచ్‌లో, రోహిత్ ఒక మార్పు చేయాల్సి ఉంటుంది. అతను ఎవరిని మినహాయించాలి అనేది రోహిత్ ముందు ప్రశ్నగా మారింది.
ఇండోర్‌లో జరగనున్న రెండో మ్యాచ్‌లో టీమ్‌ఇండియాలో ఒక మార్పు ఖాయమైంది. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పునరాగమనం చేయనున్నాడు. తన కూతురు వామిక పుట్టిన రోజు కావడంతో తొలి మ్యాచ్ ఆడలేదు. కానీ, కోహ్లీ ఇప్పుడు జట్టులోకి రావడంతో రెండో టీ20 మ్యాచ్‌లో ఆడడం ఖాయని తెలుస్తోంది.
2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో కోహ్లి తన చివరి టీ20 మ్యాచ్‌ని భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత విరాట్, రోహిత్ T20 నుంచి విరామం తీసుకున్నారు. అయితే, రోహిత్, కోహ్లి ఈ సంవత్సరం ఆడబోయే T20 ప్రపంచ కప్‌నకు తాము అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. బహుశా వారిద్దరూ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో ఎంపికయ్యారు. ప్రపంచకప్‌నకు ముందు భారత్‌కి ఇదే చివరి టీ20 సిరీస్. ఈ పరిస్థితిలో కోహ్లీ ఆడడం ఖాయం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రోహిత్ ఎవరిని మినహాయిస్తాడు? కోహ్లి రాకతో ఎవరికి కెప్టెన్ హ్యాండిస్తాడో చూడాలి. అయితే, ముఖ్యంగా వినిపిస్తోన్న పేరు తిలక్ వర్మదే. అతను గత మ్యాచ్‌లో 3వ స్థానంలో ఆడాడు. అతని ప్రదర్శన కూడా ప్రత్యేకంగా ఏమీ లేదు. అందువల్ల, కోహ్లీని ఆడించేందుకు రోహిత్ ఈ హైదరాబాదీని వదులుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది.
ఇది కాకుండా, రోహిత్ మరో మార్పు చేయవచ్చు. గత మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కి అవకాశం లభించింది. జైస్వాల్‌కు గజ్జల్లో సమస్య ఉందని అందుకే ఆడలేదని తెలిపారు. అతని స్థానంలో గిల్‌కి మళ్లీ అవకాశం లభించింది. రెండో మ్యాచ్‌లో జైస్వాల్ ఫిట్‌గా ఉంటే గిల్ ఔట్ కావాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..